ప్రియాంకా గాంధీ చెంపల్లా ఈ రోడ్లను నున్నగా చేస్తా: బీజేపీ నేత కామెంట్స్‌

బిహార్‌లో లాలూ ప్రసాద్ యాదవ్ రోడ్లను హేమమాలిని చెంపల్లా నున్నగా చేస్తానని అప్పట్లో చెప్పారని కూడా అన్నారు.

ప్రియాంకా గాంధీ చెంపల్లా ఈ రోడ్లను నున్నగా చేస్తా: బీజేపీ నేత కామెంట్స్‌

Updated On : January 5, 2025 / 6:35 PM IST

కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంకా గాంధీపై బీజేపీ ఢిల్లీ నేత, కల్కాజీ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థి రమేశ్ బిధురి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఢిల్లీ ఎన్నికల్లో తాను గెలిస్తే ప్రియాంక గాంధీ వాద్రా చెంపల్లా తన అసెంబ్లీ నియోజకవర్గంలోని రోడ్లను నున్నగా చేస్తానని ఆయన చెప్పారు.

బిహార్‌లో లాలూ ప్రసాద్ యాదవ్ రోడ్లను హేమమాలిని చెంపల్లా నున్నగా చేస్తానని అప్పట్లో చెప్పారని, అయితే, ఆయన ఆ హామీని నెరవేర్చడంలో విఫలమయ్యారని రమేశ్ బిధురి అన్నారు. తాము ఇప్పటికే ఓఖ్లా, సంగమ్ విహార్‌లోని రోడ్లను మార్చినట్లుగానే, ఇప్పుడు కల్కాజీలోని ప్రతి రహదారి ప్రియాంక గాంధీ చెంపల్లా ఉండేలా చూస్తామని తెలిపారు.

రమేశ్ బిధురి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేతలు మండిపడుతున్నారు. ఆయన చేసిన కామెంట్స్‌ సిగ్గుచేటని, మహిళల పట్ల ఆయనకున్న మనస్తత్వాన్ని ఈ వ్యాఖ్యలు ప్రతిబింబిస్తున్నాయని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాటే అన్నారు. బీజేపీ మహిళా వ్యతిరేక పార్టీ అని చెప్పారు. ప్రియాంక గాంధీ గురించి రమేశ్ బిధూరి చేసిన ప్రకటన సిగ్గుచేటు మాత్రమే కాకుండా, అతని మనస్తత్వాన్ని కూడా తెలియజేస్తుందని తెలిపారు. క్షమించాలని ప్రియాంకా గాంధీని బీజేపీ కోరాలని అన్నారు.

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పవన్ ఖేరా స్పందిస్తూ.. ఈ తీరు రమేశ్ బిధురి మనస్తత్వాన్ని మాత్రమే కాకుండా, ఆయన పార్టీ అధినేతల నిజస్వరూపాన్ని కూడా చూపుతుందని చెప్పారు. బీజేపీ పై స్థాయి నేతల నుంచి కింది స్థాయి నేతల వరకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ భావజాలమే కనపడుతోందని అన్నారు.

Hydra Demolitions : హైదరాబాద్ లో హైడ్రా యాక్షన్ కంటిన్యూ.. అయ్యప్ప సొసైటీలోని 5 అంతస్తుల భవనం కూల్చివేత..