OMG : సీఎం కాన్వాయ్ లో రూ.2 కోట్లు పట్టివేత

అరుణాచల్ ప్రదేశ్ సీఎం కాన్వాయ్ లోని ఓ కారులో తరలిస్తున్న రూ. 1.8కోట్ల నగదు పట్టబడటం ఇప్పుడు ఆ రాష్ట్రంలో కలకలం సృష్టిస్తోంది. మంగళవారం అర్ధరాత్రి జరిపిన తనిఖీల్లో ఈ డబ్బు బయటపడింది.ఓటర్లకు బీజేపీ డబ్బులు పంచుతోందంటూ కాంగ్రెస్ ఆరోపించింది. సీఎం పెమా ఖండు, డిప్యూటీ సీఎం చౌనా మేతోపాటు ప్రధాని నరేంద్ర మోడీపైనా కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా డిమాండ్ చేశారు.వెంటనే సీఎం,డిప్యూటీ సీఎంలను పదవుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. పసిఘాట్ లో మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది.
బుధవారం ఉదయమే అక్కడ ప్రధాని మోడీ ఎన్నికల ర్యాలీ నిర్వహించారు.ప్రధాని ర్యాలీకి వచ్చే ప్రజలకు డబ్బు పంచేందుకే ఈ నగదును తరలించే ఏర్పాట్లు చేసి ఉంటారని కాంగ్రెస్ నాయకుడు రణదీప్ సుర్జేవాలా ప్రశ్నించారు. ఈశాన్య ఓటర్లను డబ్బు ఆశ చూపించి బీజేపీ వలలో వేసుకుంటున్నదని సూర్జేవాలా ఆరోపించారు.ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన అన్నారు.చౌకీదార్ దొంగ అని ఈ ఘటనతో మరోసారి రుజువైందన్నారు.
ఎన్నికల సంఘం అధికారులు, పోలీసుల సమక్షంలో సీఎం కాన్వాయ్ నుంచి డబ్బు రికవరీ చేస్తున్న రెండు వీడియోలను సూర్జేవాలా మీడియాకు రిలీజ్ చేశారు. సోషల్ మీడియాలో ఈ వీడియోలు తమకు లభించాయని ఆయన చెప్పారు. ఓడిపోతామనే భయంతోనే బీజేపీ డబ్బు పంచే కార్యక్రమానికి తెర తీసిందని సూర్జేవాలా విమర్శించారు. ఏకంగా సీఎం కాన్వాయ్ నుంచే ఈ డబ్బు పట్టుబడటం అరుణాచల్‌లో సంచలనం సృష్టించింది.
అయితే ఈ ఘటనపై అరుణాచల్‌ప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి కళింగ్ తయేంగ్ స్పందించారు.కొన్ని వాహనాల నుంచి రూ. 1.80కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారన్నది నిజమే. అయితే దీనిపై కచ్చితమైన వివరాలు ఇంకా రాలేదు. ప్రధాని మోదీ ర్యాలీలో డిప్యూటీ కమిషన్, ఎస్పీ బిజీగా ఉండటంతో వారింకా రిపోర్టును అందించలేదు. నివేదిక వచ్చిన తర్వాతే దీనిపై నిజానిజాలు తెలుస్తాయి అని కళింగ్ అన్నారు.
LIVE: Press briefing by @rssurjewala, I/C, AICC Communications. https://t.co/1iRgV3ifX3
— Congress Live (@INCIndiaLive) April 3, 2019