Techies Journey: ఐఐటీ చదవలేదు, ఎంబీఏ చేయలేదు.. రూ.26 లక్షల నుంచి 70 లక్షలకు పెరిగిన జీతం.. ఆశ్చర్యానికి గురి చేస్తున్న టెకీ కెరీర్ గ్రోత్..

ఈ పోస్ట్ చాలా మందిని ముఖ్యంగా IIT లేదా MBA నేపథ్యాలు లేని వారిని ఆకట్టుకుంది. వారు అతని ప్రయాణాన్ని స్ఫూర్తిదాయకంగా, అంకితభావం, పట్టుదల శక్తికి నిదర్శనంగా భావించారు.

Techies Journey: ఐఐటీ చదవలేదు, ఎంబీఏ చేయలేదు.. రూ.26 లక్షల నుంచి 70 లక్షలకు పెరిగిన జీతం.. ఆశ్చర్యానికి గురి చేస్తున్న టెకీ కెరీర్ గ్రోత్..

Updated On : August 4, 2025 / 6:22 PM IST

Techies Journey: ఈరోజుల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు, భారీ శాలరీలు రావాలంటే.. పెద్ద పెద్ద చదువులు చదవాల్సిందే. ఎంబీఏ, ఐఐటీ, పీజీ వంటి కోర్సులు చేయాల్సిందే. ఆ తర్వాత దానికి తగ్గట్లుగా కొలువులు, జీతాలు వస్తాయనే నమ్మకం అందరిలోనూ ఉంది. అయితే, పెద్ద జీతాలు అందుకోవడానికి అవేమీ అవసరం లేదని ఓ టెకీ ప్రూవ్ చేశాడు. అతడు ఐఐటీ చదవలేదు, ఎంబీఏ చేయలేదు.. కానీ, అతడి జీతం 26 లక్షల నుంచి 70 లక్షలకు పెరిగింది. ఈ విషయాన్ని అతడే స్వయంగా సోషల్ మీడియాలో తెలిపాడు. ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తన కెరీర్ పురోగతి గురించి చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. అందరి దృష్టిని విశేషంగా ఆకర్షించింది.

భారతీయ సాంకేతిక నిపుణులు తరచుగా లింక్డ్ఇన్, ఎక్స్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తమ కెరీర్ ప్రయాణాలను పంచుకుంటారు. వారి విజయాలు, వైఫల్యాల గురించి తెలియజేస్తారు. అలా వారు పంచుకునే విషయాలు ప్రేరణ కలిగిస్తాయి. స్ఫూర్తిని నింపుతాయి. ఇటీవల, ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తన జీతం సంవత్సరానికి రూ. 26 లక్షల నుండి రూ. 70 లక్షలకు పెరిగిందని తెలుపుతూ పంచుకున్న స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సౌరభ్ యాదవ్ అనే టెకీ.. తాను IIT డిగ్రీ లేదా MBA లేకుండానే విజయం సాధించానని వివరించారు. కష్టపడి పని చేయడాన్ని హైలైట్ చేశాడు. ఈ ట్వీట్ చాలా మందిని ఆకట్టుకుంది. అధిక జీతం ఉన్న ఉద్యోగాలు పొందాలంటే అగ్రశ్రేణి సంస్థలు మాత్రమే ఏకైక మార్గం అనే భావనను దూరం చేసేలా అతడు తన స్టోరీని పంచుకున్నాడు.

”తొలి జాబ్ లో ఏడాదికి 26లక్షల జీతం, రెండో జాబ్ లో ఏడాదికి 28 లక్షలు జీతం.. మూడో ఉద్యోగంలో ఏడాదికి జీతం 70 లక్షలు. నేను ఐఐటీ చదవలేదు, ఎంబీఏ చేయలేదు. కేవలం హార్డ్ వర్క్ చేశాను” అంటూ ఆ టెకీ పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.

ఈ ట్వీట్ స్వల్ప వ్యవధిలోనే వైరల్ అయిపోయింది. నెటిజన్ల నుంచి ప్రశ్నల వర్షం కురిసింది. పెద్ద పెద్ద చదువులు చదవకుండానే ఇదెలా సాధ్యమైంది అంటూ ఆరా తీసే ప్రయత్నం చేశారు. అతను పనిచేసిన డొమైన్‌లు, చర్చల వ్యూహాలు, అతని అభివృద్ధికి దోహదపడిన నైపుణ్యాల గురించి తెలుసుకునేందు ఆసక్తి చూపించారు.

ఈ పోస్ట్ చాలా మందిని ముఖ్యంగా IIT లేదా MBA నేపథ్యాలు లేని వారిని ఆకట్టుకుంది. వారు అతని ప్రయాణాన్ని స్ఫూర్తిదాయకంగా, అంకితభావం, పట్టుదల శక్తికి నిదర్శనంగా భావించారు. “ఇవి చాలా పెద్ద విజయాలు.. మీ భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు” అని కొందరు ట్వీట్ చేశారు. “చాలా బాగుంది, అభినందనలు. స్థిరంగా, వినయంగా ఉండండి. తెలివిగా ఖర్చు చేయండి. పెట్టుబడి పెట్టండి” అని మరొక నెటిజన్ సలహా ఇచ్చాడు. “వావ్, మీ కథ చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది” అని మరొకరు అన్నారు.

Also Read: మీకు ఈ నెల జీతం పడిందా? మీ పిల్లల భవిష్యత్తు కోసం కేవలం రూ. 400 పెట్టుబడితో రూ. 70 లక్షలు సంపాదించుకోవచ్చు..!