Salaries Hike : ఉద్యోగులకు కేంద్రం మరో గుడ్‌న్యూస్‌.. పెరగనున్న జీతం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పనుంది. వచ్చే ఏడాది జనవరి నుంచి వారి వేతనాలు పెరగనున్నాయి.

Salaries Hike : ఉద్యోగులకు కేంద్రం మరో గుడ్‌న్యూస్‌.. పెరగనున్న జీతం

Salaries Hike

Updated On : November 12, 2021 / 10:58 PM IST

Salaries Hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పనుంది. వచ్చే ఏడాది జనవరి నుంచి వారి వేతనాలు పెరగనున్నాయి. హెచ్‌ఆర్‌ఏ (హౌజ్‌ రెంట్ అలవెన్స్‌) పెంచే అంశంపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. కొన్ని రోజుల కిందటే ఉద్యోగులకు కరవు భత్యం (డీఏ) పెంచిన కేంద్రం.. తాజాగా హెచ్‌ఆర్‌ఏ పెంపుపై కసరత్తు ముమ్మరం చేసింది.

Bhargavi : భార్గవి ఎక్కడ..? మిస్టరీగా మారిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మిస్సింగ్.. సీసీ కెమెరాలో షాకింగ్ విజువల్స్

ఈ నిర్ణయంతో 11.56 లక్షల కేంద్ర ఉద్యోగులకు లబ్ది కలగనుంది. వచ్చే ఏడాది నుంచి హెచ్ఆర్‌ఏను పెంచాలని ఇండియన్‌ రైల్వేస్‌ టెక్నికల్‌ సూపర్‌వైజర్స్‌ అసోసియేషన్ (IRTSA)‌, నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ రైల్వేమెన్ ‌(NFIR‌) డిమాండ్‌ చేశాయి. ఈ డిమాండ్‌ను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిగణనలోకి తీసుకుంది. ఈ ప్రతిపాదనను రైల్వే బోర్డుకు పంపింది. ఇందుకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపితే.. 2022 జనవరి నుంచి ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ పెరుగుతుంది.

Snake : పాము కాటుకు గురైన వెంటనే ఏం చేయాలో తెలుసా?

ఎక్స్‌, వై, జడ్‌ అంటూ మూడు భాగాలుగా నగరాలను విభజించి హెచ్ఆర్ఏను లెక్కిస్తారు. ఎక్స్‌ భాగానికి రూ.5వేల 400, వై భాగానికి రూ.3వేల 600, జడ్‌ భాగానికి రూ.1800 లుగా హెచ్ఆర్ఏ పెంచనున్నట్లు సమాచారం. దీని బట్టి ఎక్స్‌ ఉద్యోగులకు 27శాతం, వై వారికి 18, జడ్‌ వారికి 9 శాతం హెచ్‌ఆర్‌ఏ పెరుగనుంది. 50 లక్షలకు పైగా జనాభా ఉండే నగరాలు ‘ఎక్స్‌’ విభాగంలోకి వస్తాయి. ఈ నగరాల్లో ఉండే కేంద్ర ఉద్యోగులకు 27 శాతం హెచ్‌ఆర్‌ఏ పెరుగుతుంది.