పిచ్చి పీక్స్ : వరుడి గెటప్ తో గుర్రంపై ఊరేగుతు నామినేషన్
లోక్ సభ ఎన్నికలు చిత్ర విచిత్రమైన ఘటనలకు వేదికలవుతున్నాయి. ఒక్కక్కరు ఒక్కో విధంగా వినూత్న రీతిలో నామినేషన్ వేస్తున్నారు.

లోక్ సభ ఎన్నికలు చిత్ర విచిత్రమైన ఘటనలకు వేదికలవుతున్నాయి. ఒక్కక్కరు ఒక్కో విధంగా వినూత్న రీతిలో నామినేషన్ వేస్తున్నారు.
లక్నో: లోక్ సభ ఎన్నికలు చిత్ర విచిత్రమైన ఘటనలకు వేదికలవుతున్నాయి. ఒక్కక్కరు ఒక్కో విధంగా వినూత్న రీతిలో నామినేషన్ వేస్తున్నారు. దేశ వ్యాప్తంగా పలు విడతలుగా లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ఓ ఎంపీ అభ్యర్థి పెళ్లి కొడుకులా ముస్తాబై..గుర్రంపై ఊరేగుతు వెళ్లి నామినేషన్ వేశారు.
ఉత్తరప్రదేశ్‌లోని షాహజహాన్‌పూర్‌లో సంయుక్త్ వికాస్ పార్టీకి చెందిన ఎంపీ అభ్యర్థి వైద్ రాజ్ కిషన్..దర్జాగా పెళ్లి కుమారిడిలా ముస్తాబై..గుర్రంపై ఊరేగుతు వెళ్లి మరీ తన నామినేషన్ ను వేశారు. షేర్వానీ వేసుకుని.. నగలతో అలంకరించుకుని.. వరుడి గెటప్ లో గుర్రంపై బారాత్ తీశాడు. ఈ విశేషాన్ని చూసేందుకు స్థానికులు భారీ సంఖ్యలో చేరుకుని ఆసక్తిగా తిలకించారు.
బాలీవుడ్ పాటలకు డ్యాన్స్ లేస్తు ఈ ర్యాలీ లో పాల్గొన్నారు. వరుడి గెటప్‌తో వచ్చిన కిషన్.. స్థానికులను ఆశ్చర్యపరిచాడు. రాజకీయాలకు నేను అల్లుడినంటూ డైలాగులు వేశాడు. ఈరోజు నా పెళ్లి రోజు అని.. అందుకే పెళ్లి కొడుకు వేషంలో వచ్చానని, నామినేషన్ వేసేందుకు అల్లుడిలా వెళుతున్నానంటు ఛలోక్తులు విసిరారు. కలెక్టర్ ఆఫీసులో నామినేషన్ వేసేందుకు వెళ్తున్నానంటూ చెప్పాడు. కాగా బారాత్ కు అనుమతి లేదంటు పోలీసులు కిషన్ ని సర్దార్ బజార్ ఏరియాలో ఆపేశారు. అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్లి నామినేషన్ వేశారు ఎంపీ అభ్యర్తి కిషన్.