SBI వినియోగదారులకు హెచ్చరిక

SBI వినియోగదారులకు హెచ్చరిక

Updated On : January 30, 2021 / 6:34 PM IST

sbi issues warning for customers: బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన కస్టమర్లను హెచ్చరించింది. లోన్లు, ఆఫర్లు పేరుతో వచ్చే ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలంది. ‘మోసపూరిత ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్త వహించండి’ అని ఎస్బీఐ తన ట్విట్టర్ ద్వారా తెలిపింది. ”రుణాలు ఇప్పిస్తామని లేదా రుణాలను మాఫీ చేయిస్తామని కానీ కొన్ని లింకులను పంపుతారు. మీ బ్యాంక్ ఖాతాకు సంబంధించిన వివరాలను పొందుపరచమని అడుగుతారు. అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండండి” అని ఎస్బీఐ హెచ్చరించింది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)లో రిజిస్టర్ చేయబడిన బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల తరపున చట్టబద్ధంగా రుణం ఇవ్వవచ్చు. ఇది కాకుండా, రాష్ట్ర ప్రభుత్వాలతో రిజిస్టర్డ్ యూనిట్లు కూడా రుణాలు ఇవ్వొచ్చు. అనధికార డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లకు బలైపోకుండా ఉండాలని ఎస్బీఐ హెచ్చరించింది. ఈ మేరకు వినియోగదారులకు పలు సూచనలు ఇవ్వడంతో పాటు కొన్ని భద్రతా చిట్కాలను ఎస్బీఐ షేర్ చేసింది.