SBI Jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఎస్బీఐలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. పోస్టులు, అర్హతలు

అప్లికేషన్ ఫీజు రూ.750. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు. SBI SCO Recruitment 2023

SBI Jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఎస్బీఐలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. పోస్టులు, అర్హతలు

SBI SCO Recruitment 2023 (Photo : Google)

SBI SCO Recruitment 2023 : మీరు బ్యాంకు జాబ్ లక్ష్యంగా పెట్టుకున్నారు. గవర్నమెంట్ సెక్టార్ కి చెందిన బ్యాంకులో కొలువు కోరుకుంటున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

ఎస్బీఐలో స్పెషల్ కేడర్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందులో 442 మేనేజర్, స్పెష్టలిస్ట్ పోస్టులున్నాయి. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్ 6 2023. విద్యార్హతలు.. అభ్యర్థులు బీటెక్/బీఈ లేదా ఎంసీఏ చేసి ఉండాలి. అప్లికేషన్ ఫీజు రూ.750. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు. పూర్తి వివరాలకు https://sbi.co.in సైట్ కి వెళ్లండి. అభ్యర్థులు అఫీషియల్ సైట్ లో అప్లయ్ చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సెప్టెంబర్ 16 నుంచి ప్రారంభమైంది.

Also Read..Vacancies in IDBI : ఐడీబీఐ లో జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఖాళీల భర్తీ

ముఖ్యమైన తేదీలు..
అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ – సెప్టెంబర్ 16 2023
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ – అక్టోబర్ 6 2023
ఆన్ లైన్ టెస్ట్ నిర్వహించే తేదీ- డిసెంబర్ 2023/జనవరి 2023 మధ్యన
పరీక్ష తేదీకి 10 రోజుల ముందు కాల్ లెటర్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి
రాత పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక

Also Read..RBI Assistant Vacancy : ఆర్‌బీఐ శాఖల్లో అసిస్టెంట్ పోస్టుల భర్తీ