Vacancies in IDBI : ఐడీబీఐ లో జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఖాళీల భర్తీ
ఎంపికైన వారికి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ విభాగంలో ఏడాది కాలం శిక్షణ ఉంటుంది. ఇందులో 6 నెలలు క్లాస్‌రూమ్ సెషన్, 2 నెలలు ఇంటర్న్‌షిప్, 4 నెలలపాటు ఉద్యోగ శిక్షణ ఇస్తారు.

Vacancies in IDBI
Vacancies in IDBI : ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఐ) బ్యాంకులో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 600 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
READ ALSO : Prevention of Pests : వరి, పత్తిలో చీడపీడల నివారణ
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే ఏదైనా యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 21 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఇతరులకు వయసు సదలింపు వర్తిస్తుంది. మణిపాల్ (బెంగళూరు), నిట్టే (గ్రేటర్ నోయిడా) విద్యాసంస్థలతో కలిసి పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (పీజీడీబీఎఫ్) కోర్సు ద్వారా ఈ పోస్టులను ఐడీబీఐ భర్తీ చేయనుంది.
READ ALSO : Daggubati Purandheswari : పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి రియాక్షన్ ..
ఎంపికైన వారికి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ విభాగంలో ఏడాది కాలం శిక్షణ ఉంటుంది. ఇందులో 6 నెలలు క్లాస్‌రూమ్ సెషన్, 2 నెలలు ఇంటర్న్‌షిప్, 4 నెలలపాటు ఉద్యోగ శిక్షణ ఇస్తారు. కోర్సు విజయవంతంగా పూర్తి చేసుకున్నవారికి పీజీడీబీఎఫ్ సర్టిఫికేట్‌తోపాటు జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్-ఓ) ఉద్యోగం ఇస్తారు. అదే క్రమంలో ఎంపికైన అభ్యర్థులు శిక్షణ కు కోర్సు ఫీజు కింద రూ.3,00,000 విడతల వారీగా చెల్లించాల్సి ఉంటుంది.
READ ALSO : Heart Attack : జిమ్‌లో ట్రెడ్‌మిల్‌పై నడుస్తూ గుండెపోటుతో యువకుడి మృతి
అభ్యర్ధుల ఎంపిక రాతపరీక్ష అధారంగా జరుగుతుంది. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. శిక్షణ పూర్తి చేసుకుని ఉద్యోగంలో చేరినవారికి రూ.6.14 నుంచి రూ.6.50 లక్షల వరకు వార్షిక వేతనం చెల్లిస్తారు. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీగా 30.09.2023. నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.idbibank.in/ పరిశీలించగలరు.