Delhi Air Pollution : ఢిల్లీ వాయు కాలుష్యం-ఆస్పత్రుల నిర్మాణానికి సుప్రీంకోర్టు అనుమతి

ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో వాయు కాలుష్యంపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కాలుష్య నియంత్రణకు గత కొన్నివారాలుగా తాము తీసుకుంటున్న చర్యలపై కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్లు దాఖలు చే

Delhi Air Pollution : ఢిల్లీ వాయు కాలుష్యం-ఆస్పత్రుల నిర్మాణానికి సుప్రీంకోర్టు అనుమతి

Delhi Air pollution

Updated On : December 3, 2021 / 12:16 PM IST

Delhi Air Pollution :  ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో వాయు కాలుష్యంపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కాలుష్య నియంత్రణకు గత కొన్నివారాలుగా తాము తీసుకుంటున్న చర్యలపై కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్లు దాఖలు చేసింది. సుప్రీంకోర్టు  కాలుష్య నియంత్రణ చర్యలను కఠినంగా అమలుచేయాలని కేంద్ర, రాష్ర్ర్ట ప్రభుత్వాలను గతంలో ఆదేశించింది.

దీపావళి తర్వాత గత నెలలో ఢిల్లీలో గాలినాణ్యాత బాగా క్షీణించింది. పంట పొలాల్లో మంటలు కూడా కారణమయ్యాయి. ఢిల్లీలోని కోవిడ్  ఆస్పత్రుల నిర్మాణాలు మినహా మిగిలిన సాధారణ నిర్మాణ కార్యకలాపాలన్నీ నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 10 కి వాయిదా వేసింది.
Also Read : Tiruchanur Brahmotsavam 2021 : రాజమన్నార్ స్వామి అలంకారంలో కల్పవృక్ష వాహనంపై శ్రీ పద్మావతి అమ్మవారు
ఢిల్లీ ప్రభుత్వం ఎన్‌ఫోర్స్మెంట్ టాస్క్‌ఫోర్సును, 17 ఫ్లయింగ్ స్వ్వాడ్స్ ను ఏర్పాటు చేసినట్లు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. పాఠశాలలను మూసివేసినట్లు ఢిల్లీ ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. కాలుష్య నియంత్రణకి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు తీసుకున్న చర్యలపై సుప్రీంకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది.