ఆప్ కి గట్టి ఎదురుదెబ్బ : అధికారం కేంద్రానిదేనన్న సుప్రీం

ఆప్ కి గట్టి ఎదురుదెబ్బ : అధికారం కేంద్రానిదేనన్న సుప్రీం

Updated On : February 14, 2019 / 6:11 AM IST

ఆప్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది.ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం, కేంద్రం మధ్య అధికారాల వివాదానికి సంబంధించి గురువారం(ఫిబ్రవరి-14,2019) సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. యాంటీ కరప్షన్ బ్రాంచ్(ACB) వంటి సంస్థలను నియంత్రించే అధికారం కోసం ప్రయత్నించిన ఆప్ ప్రభుత్వానికి సుప్రీం తీర్పు షాక్ ఇచ్చింది. కేంద్రప్రభుత్వ అధికారులపై ఢిల్లీ ప్రభుత్వం దర్యాప్తు జరిపేందుకు వీల్లేదని జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్ లతో కూడిన ఇద్దరు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసం తీర్పు వెలువరించింది. కేవలం కేంద్రప్రభుత్వానికి మాత్రమే విచారణ కమిషన్ ఏర్పాటు చేయడానికి అధికారం ఉందని కోర్టు తెలిపింది.