ఇప్పుడు కన్నీళ్లు : పాలలో నీళ్లు కలిపిన వ్యక్తికి జైలు
టైటిల్ చూసి కంగుతిన్నారా. పాలలో నీళ్లు కలిపితే జైలు శిక్ష విధించడం ఏంటని విస్తుపోయారా. అయినా మన దేశంలో పాలలో నీళ్లు కలపడం చాలా కామన్. దానికి కూడా జైలు శిక్ష

టైటిల్ చూసి కంగుతిన్నారా. పాలలో నీళ్లు కలిపితే జైలు శిక్ష విధించడం ఏంటని విస్తుపోయారా. అయినా మన దేశంలో పాలలో నీళ్లు కలపడం చాలా కామన్. దానికి కూడా జైలు శిక్ష
టైటిల్ చూసి కంగుతిన్నారా. పాలలో నీళ్లు కలిపితే జైలు శిక్ష విధించడం ఏంటని విస్తుపోయారా. అయినా మన దేశంలో పాలలో నీళ్లు కలపడం చాలా కామన్. దానికి కూడా జైలు శిక్ష వేస్తారంటే నమ్ముతామా అని మీరు అనొచ్చు. కానీ… ఇది నిజం. పాలను కల్తీ చేసిన కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పాలను కల్తీ చేసినందుకు ఓ వ్యక్తికి 6 నెలల జైలు శిక్ష విధించింది. ఇక మరో విశేషం ఏంటంటే.. 24 ఏళ్ల తర్వాత ఈ కేసులో తీర్పు వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ లో ఈ ఘటన జరిగింది. రాజ్ కుమార్ అనే వ్యక్తి పాల వ్యాపారి. 1995లో పాలలో నీళ్లు కలిపి ప్రజలకు అమ్మాడు. అతడు అమ్మిన పాలపై కొందరు అభ్యంతరం తెలిపారు. ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన అధికారులు కేసు నమోదు చేశారు. పాలను సేకరించి ల్యాబ్ కి పంపారు. అక్కడ పరీక్షలు నిర్వహించారు. పాలు కల్తీ జరిగిన మాట వాస్తవమే అని అధికారులు నివేదిక ఇచ్చారు. పాలలో నీళ్లు కలిశాయని అధికారులు తేల్చడంతో ట్రయల్ కోర్టు రాజ్ కుమార్ ని దోషిగా తేల్చింది.
దీనిపై రాజ్ కుమార్ సెషన్స్ కోర్టుతో పాటు హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు పోరాడాడు. కానీ లాభం లేకపోయింది. సెషన్స్ కోర్టు, హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టు సమర్ధించింది. ఆ వ్యక్తికి 6 నెలల జైలు శిక్ష విధించింది. కాగా, ఒక్క కేసు విషయంలో 24 ఏళ్లు పాటు వాదనలు జరగడం, జైలు శిక్ష తీర్పు రావడం విశేషం. నీళ్లలో పాలు కలిపినందుకు జైలు శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సంచలనంగా మారింది. చర్చకు దారి తీసింది.
సాధారణంగా పాల నాణ్యతను కొలవడానికి కొన్ని లెక్కలు ఉంటాయి. ఆ లెక్కలు అన్నీ కరెక్ట్ గా ఉంటేనే పాలు స్వచ్చంగా ఉన్నట్టు. లెక్కల్లో ఏ మాత్రం తేడా వచ్చినా పాలను కల్తీ చేసినట్టు తెలిసిపోతుంది. రాజ్ కుమార్ విక్రయించిన పాలలో 4.6శాతం ఫ్యాట్, 7.7శాతం సాలిడ్ నాన్ ఫ్యాట్ ఉన్నాయి. లెక్క ప్రకారం 8.5 శాతం ఉండాలి. ఇది నిబంధనలకు విరుద్ధం అని అధికారులు చెప్పారు.
పాలలో నీళ్లు కలపడం వల్ల కల్తీ అయ్యాయని నిర్దారించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడినందుకు పాల వ్యాపారి రాజ్ కుమార్ పై కేసు నమోదు చేశారు. 24 ఏళ్ల తర్వాత సుదీర్ఘ వాదనల తర్వాత కోర్టు 6 నెలలు జైలు శిక్ష విధించడంతో పాల వ్యాపారి రాజ్ కుమార్ షాక్ తిన్నాడు. ఈ తీర్పుని ప్రజలు స్వాగతిస్తున్నారు. ఇలాంటి తీర్పులతో ఆహార పదార్దాలను కల్తీ చేసి వారిలో భయం మొదలవుతుందని, తప్పు చేయడానికి భయపడతారని అభిప్రాయపడ్డారు.