Uttar Pradesh : స్కూల్ కు వెళ్తున్న బాలికపై తండ్రి స్నేహితులు గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో చిత్రీకరణ
బాధిత బాలిక జరిగిన విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

school girl kidnap and assault
Uttar Pradesh School Girl Assault : ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. బాలికపై తండ్రి స్నేహితులే అఘాయిత్యానికి పాల్పడ్డారు. స్కూల్ కు వెళ్తోన్న బాలికను కిడ్నాప్ చేసి ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఘటన హాపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. రోజూలాగే బాలిక ఆటోలో స్కూల్ కు వెళ్తున్నారు. ఈ క్రమంలో తన తండ్రి స్నేహితులైన ముగ్గురు బాలిక వెళ్తున్న ఆటోను అడ్డుకున్నారు.
బలవంతంగా ఆమెను బైక్ పై ఎక్కించుకుని ఓ హోటల్ కు తీసుకెళ్లారు. అక్కడ బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రతిఘటించిన బాలికను హత్య చేసేందుకు ప్రయత్నించారు. అంతటి ఆగకుండా అత్యాచారాన్ని వీడియో రికార్డ్ చేశారు. ఎవరికైనా చెబితే ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరించారు.
UP couple : భార్యపై సామూహిక అత్యాచారం…అనంతరం విషం తాగి దంపతుల ఆత్మహత్య
కాగా, బాధిత బాలిక జరిగిన విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైద్య పరీక్షల కోసం బాలికను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ముగ్గురు నిందితులపై పోక్సో చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.