Schools Karnataka : కర్ణాటకలో నేటి నుంచి స్కూల్స్ పునఃప్రారంభం

స్కూళ్లు తిరిగి ప్రారంభంకానున్నందున శాంతి నెలకొని, సాధారణ పరిస్థితులు ఏర్పడతాయని ఆశిస్తున్నట్లు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ఆశాభావం వ్యక్తం చేశారు.

Schools Karnataka : కర్ణాటకలో నేటి నుంచి స్కూల్స్ పునఃప్రారంభం

Karnataka (1)

Updated On : February 14, 2022 / 8:47 AM IST

Karnataka Schools reopen : హిజాబ్ వివాదం కారణంగా కర్ణాటకలో మూతబడిన పాఠశాలలు ఇవాళ తిరిగి తెరుచుకోనున్నాయి. కళాశాలలు, యూనివర్సిటీల రీఓపెనింగ్‌పై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే ముందస్తు చర్యల్లో భాగంగా ఫిబ్రవరి 19 వరకు ఉడిపిలోని అన్ని ఉన్నత పాఠశాలల వద్ద 144 సెక్షన్​ విధించారు. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి ఈ నెల 19 సాయంత్రం 6 గంటల వరకు ఆదేశాలు అమల్లో ఉంటాయి.

శాంతియుత వాతావరణం కోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశాలను ఏర్పాటు చేయాలని అన్ని జిల్లాల పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇవాళ తల్లిదండ్రులు, టీచర్లతో పోలీసులు సమావేశం కానున్నారు. ఇదిలా ఉండగా.. హిజాబ్‌ వ్యవహారంపై కర్నాటక హైకోర్టు ఇవాళ మరోసారి విచారణ జరుపనున్నది.

Uttar Pradesh : ఉత్తర్ ప్రదేశ్ లో ప్రారంభమైన రెండో దశ పోలింగ్

గత గురువారం విచారణ జరగ్గా.. పాఠశాలలను ఇవాళ్టి నుంచి తెరువాలని, విద్యార్థులు హిజాబ్‌, కాషాయ కండువాల ప్రస్తావన తేకుండా తరగతులకు హాజరుకావాలని ఆదేశించింది. స్కూళ్లు తిరిగి ప్రారంభంకానున్నందున శాంతి నెలకొని, సాధారణ పరిస్థితులు ఏర్పడతాయని ఆశిస్తున్నట్లు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ఆశాభావం వ్యక్తం చేశారు.

పరిస్థితిని కొద్దిరోజులపాటు పరిశీలించిన తర్వాత ప్రీ యూనివర్సిటీ, డిగ్రీ కళాశాలను తెరిచే అంశంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. పాఠశాలలు ప్రశాంతంగా నడుస్తాయనే నమ్మకంతో ఉన్నామని సీఎం బొమ్మై అన్నారు.