Uttarakhand: నదిలో చిక్కుకున్న కారు.. అర్థరాత్రి వేళ కారులో వ్యక్తి ఎలా బయటకొచ్చాడంటే.. వీడియో వైరల్..

ఉత్తరాఖండ్‌లో ఉధృతంగా ప్రవహిస్తున్న నదిలో చిక్కుకున్న వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. అర్థరాత్రి వేళ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఆ వ్యక్తిని కాపాడారు.

Uttarakhand: నదిలో చిక్కుకున్న కారు.. అర్థరాత్రి వేళ కారులో వ్యక్తి ఎలా బయటకొచ్చాడంటే.. వీడియో వైరల్..

Man Gets Stuck In river

Updated On : October 8, 2022 / 11:50 AM IST

Uttarakhand: ఉత్తరాఖండ్‌లో ఉధృతంగా ప్రవహిస్తున్న నదిలో చిక్కుకున్న వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. రాష్ట్రంలో పౌరీ గర్వాల్ జిల్లా యంత్రతపూ సమీపంలో నది ఉంది. నదిలో వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఓ వ్యక్తి కారుతో సహా వరదనీటిలో చిక్కుకుపోయాడు. అప్పటికే రాత్రి సమయం కావటంతో అంతా చీకటి. దీంతో ఎలాగోలా కారు టాప్‌పైకి ఎక్కి ఆర్తనాదాలు చేశాడు.

Nashik Bus Accident: మహారాష్ట్ర బస్సు ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన ప్రధాని మోదీ.. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల పరిహారం

చుట్టుపక్కల వారు గమనించి అధికారులకు సమాచారం ఇవ్వటంతో వ్యక్తిని రక్షించేందుకు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF)ను రంగంలోకి దింపారు. అర్థరాత్రి సమయంలో కారుతో సహా వరదనీటిలో చిక్కుకున్న వ్యక్తిని ఎస్డీఆర్ఎఫ్ బృందం ప్రత్యేక ఆపరేషన్‌ నిర్వహించి రక్షించింది. నదిలో కారు పైభాగంలో కూర్చొని ఉన్న వ్యక్తి ఎస్డీఆర్ఎఫ్ బృందం రక్షిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

55 సెకన్ల నిడివికలిగిన వీడియోలో.. వ్యక్తి తన కారు పైకప్పుపై కూర్చున్నట్లు చూడవచ్చు. రెస్క్యూ టీమ్ సభ్యులు వ్యక్తిని రక్షించడానికి నీటిలో తాళ్లను ఉపయోగించి వ్యక్తి వద్దకు వెళ్లినట్లు వీడియో చూడొచ్చూచు. నీటిలోని చిక్కుకున్న వ్యక్తికి లైఫ్ జాకెట్‌ను అందజేసి నదినుండి బయటకు తీసుకొచ్చారు.