పవర్ ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం

పవర్ ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం

Updated On : July 1, 2020 / 4:05 PM IST

తమిళనాడులోని ఓ పవర్ ప్లాంట్ కు చెందిన బాయిలర్ పేలడంతో అగ్ని ప్రమాదం సంభవించింది. ఇందులో 16మంది తీవ్రగాయాలకు గురికాగా ఆరుగురు మృతి చెందారు. పవర్ ప్లాంట్ తమిళనాడులోని కడ్డలూరులో ఉంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎన్ఎల్సీ లిమిటెడ్(నేవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్)లో ప్రమాదం జరిగింది. ఇది చెన్నైకు 180కిలోమీటర్లు దూరంలో ఉంది. గత రెండు నెలల్లో పవర్ ప్లాంట్ లో జరిగిన రెండో ప్రమాదం ఇది.

గాయాలకు గురైన వారిని చెన్నైలోని అపోలో హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ‘బాయిలర్ ఆపరేషన్ లో లేదు. ఘటనపై విచారణ జరుపుతున్నాం. 16మంది తీవ్రగాయాలకు గురయ్యారు. ఇందులో 10మంది మాత్రమే కాంట్రాక్ట్ ఉద్యోగులు. ప్రాణాలు కోల్పోయిన ఆరుగురు ఉద్యోగులు వివరాలు సేకరిస్తున్నాం’ అని అధికారులు వెల్లడించారు.

కేంద్ర మంత్రి అమిత్ షా మృతుల పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ‘నేవేలీ పవర్ ప్లాంట్ బాయిలర్ ప్రమాదం గురించి సమాచారం అందింది. తమిళనాడు సీఎం కార్యాలయానికి ఫోన్ చేసి మాట్లాడాం. సీఐఎస్ఎఫ్ ఘటనాస్థలానికి వెళ్లి రిలీఫ్ పనులకు సాయం చేయమని కోరాం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం’ అని అన్నారు.

కంపెనీ 3వేల 940 మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేస్తంది. ఈ ప్రమాదం వెయ్యి 470 మెగావాట్ల వద్ద జరిగింది. కంపెనీలో 27వేల మంది ఉద్యోగులు, 15వేల కాంట్రాక్చువల్ వర్కర్లు పనిచేస్తున్నారు.

Read:చైనాకు ధీటుగా పవర్‌ఫుల్ ఉక్కు పడవలను లడఖ్‌‌కు పంపుతున్న భారత్