Narendra Modi: వచ్చే ఆగస్టు 15కి మళ్లీ వస్తా.. ఎర్రకోట నుంచే 2024 లోక్‌సభ ఎన్నికల జోస్యం చెప్పిన ప్రధాని మోదీ
గడిచిన సంవత్సరాల్లో ప్రభుత్వం జప్తు చేసిన ఆస్తులు గతంలో కంటే 20 రెట్లు ఎక్కువని ప్రధాని చెప్పారు. సంపాదనతో జనం పారిపోయారని.. అయితే వారి నుంచి 20 రెట్లు ఎక్కువ ఆస్తులు జప్తు చేశామని అన్నారు

Independence Day: వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలపై ప్రధాని నరేంద్ర మోదీ జోస్యం చెప్పారు. 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారం నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, వచ్చే ఏడాది ఆగస్టు 15న మళ్లీ ఎర్రకోట ప్రాకారం నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించేందుకు వస్తానని చెప్పారు. అంటే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి బీజేపీ విజయం సాధించి ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తానని మోదీ పరోక్షంగా చెప్పారు.
ఇక ఈ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ ‘‘2014లో మార్పు తీసుకొస్తానని వాగ్దానం చేశాను. మీరు నన్ను విశ్వసించారు. నేను మీకు చేసిన వాగ్దానాన్ని విశ్వాసంగా మార్చుకున్నాను. నా పనితీరు ఆధారంగా 2019లో మీరు నన్ను మళ్లీ ఆశీర్వదించారు. ఆ మార్పును కూడా చూపించాను. నాకు అవకాశం ఇచ్చారు. మీ ప్రతి కలను నెరవేరుస్తాను. వచ్చే ఆగస్టు 15న మళ్లీ వస్తాను. మీ కోసమే బతుకుతాను. నాకు చెమటలు పడితే అది మీ కోసమే. ఎందుకంటే మీరు నా కుటుంబం. మీ బాధ చూడలేకపోతున్నాను” అని అన్నారు.
2014లో గ్లోబల్ ఎకానమీలో 10వ స్థానంలో ఉన్నామని గుర్తు చేసిన మోదీ.. నేడు 140 కోట్ల మంది దేశప్రజల కృషి ఫలించి ప్రపంచంలో 5వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగామని అన్నారు. గడిచిన సంవత్సరాల్లో ప్రభుత్వం జప్తు చేసిన ఆస్తులు గతంలో కంటే 20 రెట్లు ఎక్కువని ప్రధాని చెప్పారు. సంపాదనతో జనం పారిపోయారని.. అయితే వారి నుంచి 20 రెట్లు ఎక్కువ ఆస్తులు జప్తు చేశామని అన్నారు. అందుకే అలాంటి వారికి తనపై కోపం రావడం సహజమని, అయితే అవినీతిపై పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలని మోదీ అన్నారు.
Independence Day: ఎర్రకోట మీద నుంచి ప్రధాని మోదీ చేసిన 10 ముఖ్యమైన ప్రకటనలు
అవినీతి, బుజ్జగింపులు, కుటుంబ రాజకీయాలు అభివృద్ధికి అతిపెద్ద శత్రువులుగా మారాయని ప్రధాని మోదీ అభివర్ణించారు. 2047లో దేశం అభివృద్ధి చెందిన భారతదేశ కలను సాకారం చేసుకోవాలంటే, వాటిని మనం నిర్మూలించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు అన్నారు. దేశం ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతి, బుజ్జగింపులు, కుటుంబ రాజకీయాల్ని సహించబోదని మోదీ అన్నారు.