“స్వయం సంవృద్ధి” కరోనా నేర్పిన అతిపెద్ద పాఠం..సర్పంచ్ లతో వీడియో కాన్ఫరెన్స్ లో మోడీ

ఇవాళ(ఏప్రిల్-24,2020)పంచాయతీ రాజ్ దివస్ సందర్భంగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లోని సర్పంచ్ లతో వీడియో కానర్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోడీ మాట్లాడారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధానితో పాటు పంచాయితీ రాజ్ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ కూడా పాల్గొన్నారు. మన ప్రంచాయితీలు ఎంత బలంగా ఉంటే మన ప్రజాస్వామ్యం అంత బలంగా ఉంటుందని మోడీ అన్నారు. గ్రామాల్లోని సమస్యలకు పరిష్కరించడంలో సర్పంచ్ ల పాత్ర చాలా కీలకమన్నారు. ఈ గ్రామ స్వరాజ్ పోర్టల్,మొబైల్ యాప్ ను మోడీ ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఈ పోర్టల్ లో పంచాయితీల డీటెయిల్స్ అన్నీ ఉంటాయని ప్రధాని తెలిపారు.
లాక్ డౌన్ అమలు తీరు,కరోనా కట్టడి చర్యలు, ఎదురువుతున్న ఇబ్బందుల గురించి సర్పంచ్ లతో ప్రధాని చర్చించారు. కరోనా నియంత్రణకు కృషి చేస్తున్న సర్పంచ్ లకు ఈ సందర్భంగా మోడీ ధన్యవాదాలు తెలిపారు. గ్రామ పంచాయతీ సర్పంచ్ లకు ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు మోడీ. కరోనా మహమ్మారి మన జీవితాలను దెబ్బ తీసిందన్నారు. కష్ఠ సమయంలో ఆత్మస్థైర్యంతో ఉండాల్సిన అవసరముందన్నారు. స్వీయ నిర్భందంలో ఉంటేనే కరోనాను అరికట్టగలమని మోడీ తెలిపారు. సోషల్ డిస్టెన్సింగ్ ను సులభతరంగా వివరించడానికి దేశంలోని పంచాయితీయులు “దూ గజ్ దూరి” మంత్ర ఇచ్చాయని మోడీ అన్నారు.
గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని సర్పంచ్ లకు మోడీ సూచించారు. కరోనా కట్టడిలో ప్రజలకు అవగాహన పెంచాలనీ సర్పంచ్ లకు సూచించారు. గ్రామ ప్రతినిధులు పేదలకు అండగా ఉండాలన్నారు. కరోనా విపత్తు సమయంలో పేదలకు ఆహార ధాన్యాలు అందించాలన్నారు. విద్యుత్,రహదారులు,పారిశుధ్యం మెరుగుదలకు చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా వైరస్ మనకు ఎన్నో పాఠాలు నేర్పిందన్నారు. స్వయం సంవృద్ధిని సాధించాలని కరోనా మనకు నేర్పిందని మోడీ అన్నారు. స్వయం సంవృద్ధిని సాధించాలని కరోనా మనకు నేర్పిందని మోడీ అన్నారు. గ్రామాలు గ్రామ స్థాయిలో,జిల్లాలు జిల్లా స్థాయిలో స్వయం సంవృద్దిని సాధించాలన్నారు.
గ్రామ పంచాయతీలను పూర్తిగా డిజిటలైజేషన్ చేసే దిశలో ఈ గ్రామ్ స్వరాజ్ ఓ ముందడుగు అని మోడీ తెలిపారు.