Serum Institute : జూన్ లో 10కోట్ల వ్యాక్సిన్ డోసులు ఇస్తాం..సీరం

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు వ్యాక్లిన్ల కొరతని ఎదుర్కొంటున్న నేపథ్యంలో సీరం ఇనిస్టిట్యూట్ కీలక ప్రకటన చేసింది.

Serum Institute : జూన్ లో 10కోట్ల వ్యాక్సిన్ డోసులు ఇస్తాం..సీరం

Serum Institute

Updated On : May 30, 2021 / 9:29 PM IST

Serum Institute దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు వ్యాక్లిన్ల కొరతని ఎదుర్కొంటున్న నేపథ్యంలో సీరం ఇనిస్టిట్యూట్ కీలక ప్రకటన చేసింది. జూన్ లో 9- 10 కోట్ల కొవిషీల్డ్ వ్యాక్సిన్ల‌ను ఉత్ప‌త్తి చేసి, స‌ర‌ఫ‌రా చేస్తామ‌ని ఆదివారం సీరం సంస్థ కేంద్ర ప్ర‌భుత్వానికి తెలిపింది. వ్యాక్సిన్ల‌కు డిమాండ్ పెరుగుతున్న నేప‌థ్యంలో త‌మ సిబ్బంది 24 గంట‌లూ ఉత్ప‌త్తిని పెంచ‌డానికి ప‌ని చేస్తున్న‌ట్లు కేంద్ర‌ హోంమంత్రి అమిత్ షా రాసిన లేఖ‌లో సీరం సంస్థ స్ప‌ష్టం చేసింది. జూన్ నెల‌లో 10 కోట్ల వ్యాక్సిన్లు త‌యారు చేస్తామ‌ని చెప్ప‌డానికి సంతోషిస్తున్నాం. మేలో 6.5 కోట్లుగా ఉన్న ఉత్ప‌త్తి సామర్థ్యాన్ని ప‌ది కోట్ల‌కు పెంచ‌బోతున్నామ‌ని ఆ లేఖ‌లో సీరం డైరక్టర్ ప్ర‌కాశ్ కుమార్ సింగ్ తెలిపారు.

సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎల్లప్పుడూ COVID-19 నుండి మన దేశం మరియు ప్రపంచంలోని పౌరుల రక్షణ గురించి హృదయపూర్వకంగా ఆందోళన చెందుతోంది. అదర్ పూనావాలా నాయకత్వంలో కోవిడ్ -19 మహమ్మారిపై పోరాడటానికి మా బృందం ప్రభుత్వంతో భుజం భుజం కలిపి పనిచేస్తోంది అని ఆయన లేఖలో పేర్కొన్నారు. కోవిడ్ వ్యాక్సిన్లలో భారతదేశాన్ని ‘ఆత్మనీర్భర్’ (స్వయం సమృద్ధిగా) చేయడానికి మరియు దేశ ప్రజలకు వాటిి అందుబాటులో ఉంచడానికి వివిధ దశలలో అమిత్ షా ఇచ్చిన “విలువైన మార్గదర్శకత్వం మరియు నిరంతర మద్దతు”కు కృతజ్ఞతలు అని లేఖలో ప్రకాశ్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎల్లప్పుడూ COVID-19 నుండి మన దేశం మరియు ప్రపంచంలోని పౌరుల రక్షణ గురించి హృదయపూర్వకంగా ఆందోళన చెందుతోంది. అదర్ పూనావాలా నాయకత్వంలో కోవిడ్ -19 మహమ్మారిపై పోరాడటానికి మా బృందం ప్రభుత్వంతో భుజం భుజం కలిపి పనిచేస్తోంది అని ఆయన లేఖలో పేర్కొన్నారు.

వాస్తవానికి జూన్‌లో 6.5 కోట్లు, జులైలో 7 కోట్లు, ఆగ‌స్ట్, సెప్టెంబ‌ర్‌ నెలల్లో ప‌ది కోట్ల చొప్పున వ్యాక్సిన్లు త‌యారు చేస్తామ‌ని ఈ నెల మొద‌ట్లో సీరం తెలిపింది. అయితే తాజాగా జూన్‌లోనే కొవిషీల్డ్ ఉత్ప‌త్తి సామ‌ర్థ్యాన్ని 10 కోట్ల‌కు పెంచుతున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డం విశేషం. త‌మ‌కు అందుబాటులో ఉన్న అన్ని వ‌న‌రుల‌ను ఉప‌యోగించుకొని వ్యాక్సిన్ల ఉత్ప‌త్తిని పెంచుతున్న‌ట్లు లేఖ‌లో ప్ర‌కాశ్ కుమార్ తెలిపారు.

మరోవైపు, జులై చివరినాటికి ప్రతి రోజూ కోటి మందికి టీకా వేయాలని ప్రభుత్వం భావిస్తోందని ఎయిమ్స్ డైరక్టర్ రణదీప్ గులేరియా ఇప్పటికే చెప్పిన విషయం తెలిసిందే. వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో భారత్‌ నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవాలంటే దేశంలో టీకాల ఉత్పత్తిని పెంచాలని ఎయిమ్స్‌ చీఫ్ సూచించారు. విదేశాల నుంచి వ్యూహాత్మకంగా డోసులను తెప్పించుకోవాలిని గులేరియా పేర్కొన్నారు. గర్భిణులకు త్వరగా టీకా వేయాలని ఎయిమ్స్‌ చీఫ్‌ సూచించారు. గర్భిణుల్లో అనారోగ్య సమస్యలతోపాటు మరణాల రేటు అధికంగా ఉందని, కాబట్టి వారికి త్వరగా వ్యాక్సిన్ అందించాలని ఆయన పేర్కొన్నారు.