Seven dead: కుప్పకూలిన భవనం పైకప్పు.. ఏడుగురు మృతి
మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఒక విషాద వార్త వెలుగులోకి వచ్చింది. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో ముంబై పక్కనే ఉన్న థానే నగరం పరిధిలోని ఉల్లాస్‌నగర్‌లో 5 అంతస్తుల భవనం అకస్మాత్తుగా కూలి 7 మంది మరణించారు.

Seven Dead
Building Collapse In Maharastra: మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఒక విషాద వార్త వెలుగులోకి వచ్చింది. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో ముంబై పక్కనే ఉన్న థానే నగరం పరిధిలోని ఉల్లాస్‌నగర్‌లో 5 అంతస్తుల భవనం అకస్మాత్తుగా కూలి 7 మంది మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. థానేలోని ఉల్లాస్‌నగర్‌లో సిద్ధి భవనం అకస్మాత్తుగా కూలిపోయింది. విషయం తెలియగానే థానే మునిసిపల్ కార్పొరేషన్, టిడిఆర్ఎఫ్ బృందం సంఘటన స్థలానికి చేరుకున్నాయి. శిథిలాల కింద మరికొంత మంది ఉన్నట్టు చెబుతున్నారు
7 మృతదేహాలను స్వాధీనం:
ఫైర్ బ్రిగేడ్ బృందం సంఘటన స్థలానికి చేరుకుని శిధిలాల కింద 7 మృతదేహాలను బయటకు తీశారు. ఈ భవనం సుమారు 26 సంవత్సరాల పురాతనమైనదని చెబుతున్నారు. ప్రమాదం జరిగిన తరువాత భవనం సీలు చేశారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు మహారాష్ట్ర ప్రభుత్వ మంత్రి ఏక్నాథ్ షిండే రూ .5 లక్షల పరిహారం ప్రకటించారు. భవనం ఎలా కూలిపోయిందో దర్యాప్తు చేయాలని ఆదేశించారు. అగ్నిమాపక దళ బృందంతో పాటు థానే మునిసిపల్ కార్పొరేషన్ సీనియర్ అధికారులు సంఘటన స్థలంలో సహాయచర్యలు సాగిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.
చనిపోయినవారు:
1) పునీత్ బజోమల్ చాంద్వానీ (వయసు -14 సంవత్సరాలు)
2) దినేష్ బజోమల్ చాంద్వానీ (వయసు -40 సంవత్సరాలు)
3) దీపక్ బజోమల్ చాంద్వానీ (వయసు -42 సంవత్సరాలు)
4) మోహిని బజోమల్ చంద్వానీ (వయసు -65 సంవత్సరాలు)
5) కృష్ణ ఇనుచంద్ బజాజ్ ( వయసు – 26 సంవత్సరాలు)
6) అమృత ఇనుచంద్ బజాజ్ (వయసు – 54 సంవత్సరాలు)
7) లవ్లీ బజాజ్