Arunachal Avalanche: హిమపాతంలో చిక్కుకుని ఏడుగురు సైనికాధికారులు గల్లంతు
అతి ఎత్తైన పర్వత శ్రేణుల్లో మంచు చరియలు విరిగిపడి..ఏడుగురు భారత సైనికాధికారులు గల్లంతయ్యరు. గల్లంతైన వారికోసం సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు అక్కడి అధికారులు తెలిపారు.

Avalanche
Arunachal Avalanche: అరుణాచల్ ప్రదేశ్ లో భారీ హిమపాతం బీభత్సం సృష్టిస్తుంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న మంచు తుఫాను ధాటికి పశ్చిమ కమెంగ్ జిల్లా మొత్తం అతలాకుతలం అయింది. జిల్లాలో అతి ఎత్తైన పర్వత శ్రేణుల్లో మంచు చరియలు విరిగిపడి..ఏడుగురు భారత సైనికాధికారులు గల్లంతయ్యరు. గల్లంతైన వారికోసం సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు అక్కడి అధికారులు తెలిపారు. హిమపాతం సమయంలో కొండ ప్రాంతాల్లో గస్తీ తిరుగుతున్న ఏడుగురు సైనికాధికారులు గల్లంతైనట్లు లెఫ్టినెంట్ కల్నల్ హర్షవర్ధన్ పాండే తెలిపారు. గల్లంతైన వారికోసం ప్రత్యేక బృందాలను వాయుమార్గాన మోహరింపజేసి గాలిస్తున్నట్లు ఆయన తెలిపారు.
Also read: Arasavelli Temple: అరసవెల్లిలో తొలిపూజలో పాల్గొన్న డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్
గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో విపరీతమైన హిమపాతంతో ప్రతికూల వాతావరణం నెలకొందని కల్నల్ హర్షవర్ధన్ పాండే తెలిపారు. దీంతో సహాయక చర్యలకు విఘాతం కలుగుతున్నట్లు ఆయన వివరించారు. అరుణాచల్ ప్రదేశ్ లో ఈ ఏడాది హిమపాతం కారణంగా పలు ప్రాంతాల్లో తీవ్ర ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇటానగర్ సమీపంలోని దరియా కొండ ప్రాంతంలో 34 ఏళ్ల తర్వాత మంచు కురిసింది. అరుణాచల్ ప్రదేశ్ పశ్చిమ కమెంగ్ జిల్లాలోని రూపా పట్టణంలో రెండు దశాబ్దాల తర్వాత మంచు కురిసింది.
Also read: Corona Vaccine: ఐడీ ప్రూఫ్ లేకుండానే వాక్సిన్ పంపిణీ చేశాం: సుప్రీంకు తెలిపిన కేంద్రం