Road Accident : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు సహా ఏడుగురు వైద్యవిద్యార్థులు మృతి

సెల్ సురా గ్రామం దగ్గర రాత్రి 11.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. యావత్మాల్-వార్దా రోడ్డుపై ఈ ఘటన చోటు చేసుకుంది. వంతెనపై నుంచి 50 అడుగుల లోయలో కారు పడి పోయింది.

Road Accident : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు సహా ఏడుగురు వైద్యవిద్యార్థులు మృతి

Accident (2)

Updated On : January 25, 2022 / 9:55 AM IST

Seven medical students killed in accident : మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. వార్ధా జిల్లాలో వంతెన పైనుంచి కారు పడి పోయింది. ఈ ప్రమాదంలో బీజేపీ ఎమ్మెల్యే విజయ్ రహంగ్డాలే కుమారుడు ఆవిష్కర్ సహా ఏడుగురు వైద్య విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటన మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలో చోటు చేసుకుంది.

సెల్ సురా గ్రామం దగ్గర రాత్రి 11.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. యావత్మాల్-వార్దా రోడ్డుపై ఈ ఘటన చోటు చేసుకుంది. వంతెనపై నుంచి 50 అడుగుల లోయలో కారు పడి పోయింది. యావత్మాల్ నుంచి వార్ధా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

YSR EBC Nestam : నేడు వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం పథకం ప్రారంభం.. అగ్రవర్ణ పేద మహిళలకు ఆర్థిక సాయం

సెల్ సురా గ్రామం వద్ద ఉన్న బ్రిడ్జీ దగ్గర కారు అదపు తప్పి 50 అడుగుల లోయలో పడి పోయింది వైద్య విద్యార్థులు సావింగ్ లోని వైద్య కళాశాలలో చదువుకుంటున్నారు. దీంతో వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.