NCP: ప్రసంగానికి పిలుస్తుండగా స్టేజీ దిగిన అజిత్ పవార్.. శరద్ పవార్ ముందే ఘటన.. ఎన్సీపీలో చీలిక వచ్చిందా?
శివసేన తర్వాత ఎన్సీపీనే బీజేపీ టార్గెట్ చేసిందని, ఇప్పటికే ఆ పనిలో కమల నేతలు బిజీ బిజీగా ఉన్నారన్న అంచనాల మధ్య తాజా ఘటన మరిన్ని అనుమానాలకు దారి తీస్తోంది. కొందరైతే నాలుగు అడుగులు ముందుకు వేసి.. ఎన్సీపీలో చీలికలు వచ్చాయని, అజిత్ పవార్ పార్టీ వీడే అవకాశాలు కనిపిస్తున్నాయంటూ తమ ఊహాగాణాలకు రెక్కలు తొడుగుతున్నారు. ఇంతకీ ఢిల్లీ మీటింగులో ఏం జరిగింది? అజిత్ పవార్ ఎందుకు వెళ్లిపోయారు? సుప్రియా సూలె ఆయనకు ఏం నచ్చజెప్పారు?

Sharad Pawar Nephew Leaves Party Meet Midway Sparks Rift Talk
NCP: నేషనలిస్ట్ కాంగ్రస్ పార్టీ చీఫ్‌గా శరద్ పవార్ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఢిల్లీలో పార్టీ పెద్ద మీటింగ్ నిర్వహించింది. పార్టీ ముఖ్యులు, ఇతర నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఒక్కొక్కరుగా మాట్లాడటం ముగిసింది. ఇక పార్టీ చీఫ్ శరద్ పవార్‌కు ముందు మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మాట్లాడాల్సి ఉంది. ఆయన ప్రసంగించాలని అనౌన్స్మెంట్ జరుగుతోంది. ఇంతలో అజిత్ పవార్ స్టేజి దిగి వెళ్తూ కనిపించారు. సుప్రియా సూలె ఆయనను కన్విస్ చేయడానికి ప్రయత్నించారు. కానీ ఆయన రాలేదు. అనంతరం శరద్ పవార్ ప్రసంగంతో సభ ముగిసింది.
ఇదీ నిన్న ఢిల్లీలో జరిగిన ఘటన. శివసేన తర్వాత ఎన్సీపీనే బీజేపీ టార్గెట్ చేసిందని, ఇప్పటికే ఆ పనిలో కమల నేతలు బిజీ బిజీగా ఉన్నారన్న అంచనాల మధ్య తాజా ఘటన మరిన్ని అనుమానాలకు దారి తీస్తోంది. కొందరైతే నాలుగు అడుగులు ముందుకు వేసి.. ఎన్సీపీలో చీలికలు వచ్చాయని, అజిత్ పవార్ పార్టీ వీడే అవకాశాలు కనిపిస్తున్నాయంటూ తమ ఊహాగాణాలకు రెక్కలు తొడుగుతున్నారు. ఇంతకీ ఢిల్లీ మీటింగులో ఏం జరిగింది? అజిత్ పవార్ ఎందుకు వెళ్లిపోయారు? సుప్రియా సూలె ఆయనకు ఏం నచ్చజెప్పారనే ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలైతే ఇప్పటికీ దొరకలేదు.
అయితే పార్టీ జాతీయ స్థాయి సమావేశం కావడం వల్ల తాను మాట్లాడలేకపోయానని అజిత్ పవార్ తర్వాత చెప్పొచ్చారు. అయితే ప్రసంగించమని ప్రఫుల్ పటేల్ ప్రకటిస్తున్న సమయంలో అజిత్ పవార్ వాష్రూంకి వెళ్లారట. కానీ ఆ వెనకాల అజిత్ పవార్‌ను సుప్రియా సూలె నచ్చజెప్తున్నట్లు కనిపించారు. ఇక ఆయన తిరిగి వచ్చే సమయానికి శరద్ పవార్ ప్రసంగం ప్రారంభమైందట. దీంతో అజిత్ పవార్ ప్రసంగించలేకపోయారని అంటున్నారు. పార్టీ నేతలు ఎన్ని చెప్పుకొచ్చినా ఎన్సీపీలో నెంబర్ 2గా ఉన్న అజిత్ పవార్ ప్రసంగానికి దూరంగా ఉండడంపై బలమైన అనుమానాలే వ్యక్తమవుతున్నాయి.
NIA Raids: గ్యాంగ్స్టర్లపై ఉక్కుపాదం.. దేశంలోని 60 ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు