బీజేపీకే శివసేన సపోర్ట్: మారిన మహా రాజకీయం

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం కొలిక్కి వస్తుంది. 50:50 ఫార్ములా కోసం పట్టుబట్టి కూర్చున్న శివసేన ఎట్టకేలకు ఒక మెట్టు దిగినట్లుగా తెలుస్తుంది. బిజెపి, శివసేనలు చర్చించుకోవడం ద్వారా తమ సమస్యలను పరిష్కరించుకున్నట్లు ప్రకటించాయి. ముఖ్యమంత్రి ఫడ్నవీస్, శివసేన అదినేత ఉద్దావ్ ధాక్రే లు ఇద్దరు చర్చించుకోగా సమస్యలు వీగిపోయాయని ఇరు వర్గాలు చెబుతున్నాయి.
ఇవాళ(07 నవంబర్ 2019) అసెంబ్లీ కాల పరమితి తీరిపోనుండగా.. కొత్త ప్రభుత్వం ఏర్పడవలసి ఉంది. ఈ క్రమంలోనే రెండు పార్టీలు రాజీకి వచ్చినట్లు నేతలు చెబుతున్నారు. అయితే శివసేనను ఏ విధంగా సంతృప్తిపరచారనేది తెలియరాలేదు. ఈ క్రమంలోనే గవర్నర్‌ను బీజేపీ నేతలు కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించనున్నారు.
ఈ క్రమంలోనే రాజ్‌థాక్రే ఇంటికి దగ్గరలోని ఓ హోటల్‌కు శివసేన ఎమ్మెల్యేలు చేరుకున్నారు. ఉద్ధవ్ థాక్రే ఏది చెబితే అది చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు శివసేన ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే ప్రకటించారు. బీజేపీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రస్తుత ప్రతిష్టంభనకు ముగింపు పలకాలని శివసేన భావిస్తుంది. ఎట్టకేలకు మహారాష్ట్రలో అతి పెద్ద పార్టీగా నిలిచిన బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది.