PUBG : షాకింగ్.. పట్టాలపై కూర్చుని పబ్జీ.. రైలు ఢీకొని అన్నదమ్ములు మృతి
పబ్జీ గేమ్ మీద మోజు ప్రాణాలు తీసింది. పబ్జీ గేమ్ ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. రైల్వే పట్టాలపై కూర్చుని పబ్జీ ఆడుతుండగా..

Pubg
PUBG : పబ్జీ గేమ్ మీద మోజు ప్రాణాలు తీసింది. పబ్జీ గేమ్ ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. ఈ గేమ్ కారణంగా రెండు నిండు ప్రాణాలు పోయాయి.
WhatsApp Update : వాట్సాప్ ఫ్యూచర్ అప్‌డేట్.. చాట్ లిస్టులో ఈ రెండు ఆప్షన్లు ఎత్తేస్తోంది..!
రాజస్తాన్ లో ఘోరం జరిగిపోయింది. పబ్జీ గేమ్ మోజు అన్నదమ్ముల ప్రాణాలు తీసింది. అల్వార్ జిల్లాకు చెందిన లోకేష్ మీనా(22), రాహుల్ (19) రైల్వే పట్టాలపై కూర్చుని పబ్జీ ఆడుతున్నారు. ఇంతలో అటు వచ్చిన రైలు వీరిని ఢీకొట్టింది. స్పాట్ లోనే ఇద్దరూ చనిపోయారు గేమ్ లో మునిగిపోయిన అన్నదమ్ములు రైలు వస్తున్న విషయాన్ని గమనించలేదు. దీంతో ఘోరం జరిగిపోయింది. అన్నదమ్ముల మృతితో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. తల్లిదండ్రులు గుండె పగిలేలా రోదించారు.
iPhone 12 Series : ఆపిల్ ఐఫోన్లపై భారీ తగ్గింపు.. రూ.10వేలు డిస్కౌంట్.. డోంట్ మిస్..!
పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి కుటుంసభ్యులకు అప్పగించారు పోలీసులు. కాగా, ఆన్ లైన్ గేమ్ పబ్జీకి యువత బానిసగా మారుతోంది. కొందరు యువకులు 24గంటలు పబ్జీ ఆడుతున్నారు. తిండి, నీరు, నిద్ర మానుకుని మరీ ఆ గేమ్ లో మునిగిపోతున్నారు. ఈ క్రమంలో మెంటల్ కండీషన్ తప్పి ఆసుపత్రి పాలవుతున్నారు. చివరికి తల్లిదండ్రులను కూగా గుర్తించ లేని స్థితికి వెళ్తున్నారు. ఈ గేమ్‌కి బానిసగా మారి అనేకమంది తమ ప్రాణల మీదకు తెచ్చుకుంటున్నారు. కొందరు ప్రాణాలే పోగుట్టుకున్నారు. పిల్లలు, యువత జీవితాలతో చెలగాటం ఆడుతున్న పబ్జీ గేమ్ ని బ్యాన్ చేయాలనే డిమాండ్లు వినిపించాయి. కాగా, భారత ప్రభుత్వం 118 యాప్‌లను నిషేధించగా, ఇందులో అత్యంత ప్రజాదరణ పొందిన పబ్‌జీ (PUBG) మొబైల్ గేమ్ కూడా ఉంది.