Navjot Sidhu : కేజ్రీవాల్ నివాసం బయట సిద్ధూ నిరసన

  తమ ఉద్యోగాలను పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆదివారం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంటి బయట ప్రభుత్వ గెస్ట్‌ టీచర్లు చేస్తున్న ధర్నాలో పంజాబ్ పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ

Navjot Sidhu :  కేజ్రీవాల్ నివాసం బయట సిద్ధూ నిరసన

Sidhu

Navjot Sidhu :  తమ ఉద్యోగాలను పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆదివారం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంటి బయట ప్రభుత్వ గెస్ట్‌ టీచర్లు చేస్తున్న ధర్నాలో పంజాబ్ పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ పాల్గొన్నారు. ప్రభుత్వ గెస్ట్‌ టీచర్లకు సంఘీభావంగా వారితో కలిసి నిరసనలో పాల్గొన్నారు సిద్ధూ. గెస్ట్‌ టీచర్లతో కలిసి ఆప్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతోపాటు ఫ్లకార్డులను ప్రదర్శించారు. ఢిల్లీ టీచర్లు ఇక్కడ ఉన్నారు..కేజ్రీవాల్ ఎక్కడున్నారు?అని నినాదాలు చేశారు సిద్ధూ. గత నెలలో పంజాబ్‌లోని మొహాలీలో జరిగిన కాంట్రాక్టు ఉపాధ్యాయుల నిరసన కార్యక్రమంలో పాల్గొన్నందుకు గాను కేజ్రీవాల్‌పై ఈ సందర్భంగా సిద్ధూ విమర్శలు గుప్పించారు. “మీరు పంజాబ్‌లో ప్రజలను ఆకర్షించడానికి వచ్చే ముందు మీ రాష్ట్రంలోని సమస్యలను పరిష్కరించుకోవాలి” అని సిద్ధూ అన్నారు.

అంతకుముందు ట్విట్టర్ వేదికగా కేజ్రీవాల్ సర్కార్ పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు సిద్ధూ. “ఢిల్లీ ఎడ్యుకేషన్ మోడల్ కాంట్రాక్ట్ మోడల్ …ఢిల్లీలో 1031 ప్రభుత్వ పాఠశాలల్లో.. 196 పాఠశాలల్లో మాత్రమే ప్రధానోపాధ్యాయులు ఉన్నారు. 45శాతం ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పాఠశాలలను 22వేల మంది అతిథి ఉపాధ్యాయులు(గెస్ట్ టీచర్లు) రోజువారీ వేతనాలతో ప్రతి 15 రోజులకు కాంట్రాక్ట్‌ల పునరుద్ధరణతో నడుపుతున్నారు”అని ఓ ట్వీట్ లో సిద్ధూ పేర్కొన్నారు.

“కాంట్రాక్టు టీచర్లను క్రమబద్ధీకరిస్తామని,పర్మినెంట్ సిబ్బందితో సమానమైన వేతనాలు ఆప్ హామీ ఇచ్చింది. అయితే కేవలం గెస్ట్ టీచర్లను నియమించడం ద్వారా పరిస్థితి మరింత దిగజారింది. స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీల ద్వారా, AAP వాలంటీర్లు అని పిలవబడే వ్యక్తులు ప్రభుత్వ నిధుల నుండి సంవత్సరానికి 5 లక్షలు సంపాదిస్తున్నారు, ఇది పాఠశాల అభివృద్ధికి ఉద్దేశించబడింది”అని సిద్ధూ మరో ట్వీట్ లో పేర్కొన్నారు.

“2015 ఆప్ మ్యానిఫెస్టోలో ఢిల్లీలో 8 లక్షల కొత్త ఉద్యోగాలు, 20 కొత్త కాలేజీల ఏర్పాటుకు హామీ ఇచ్చారు, ఉద్యోగాలు, కాలేజీలు ఎక్కడ ఉన్నాయి? ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం కేవలం 440 ఉద్యోగాలు ఇచ్చింది. ఢిల్లీలో నిరుద్యోగిత రేటు గత 5 సంవత్సరాలలో దాదాపు 5 రెట్లు పెరిగింది”అని మరో ట్వీట్ లో సిద్ధూ విమర్శించారు.

కాగా, వచ్చే ఏడాది ప్రారంభంలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అధికారంలో చేపట్టాలని ఆప్ ఉవ్విళ్లూరుతోంది. ఇందులో భాగంగానే ఆప్ అధినేత కేజ్రీవాల్ వరుస పంజాబ్ పర్యటనలు చేస్తూ అక్కడి పార్టీ కేడర్ లో ఉత్తేజం నింపుతున్నారు. పంజాబ్ ఓటర్లను ఆకట్టుకునేలా ముందుకు సాగుతున్నారు. అయితే కేజ్రీవాల్ బలపడితే తమకు నష్టం తప్పదని భావిస్తున్న కాంగ్రెస్..రాష్ట్రంలో అధికారాన్ని ఎట్టిపరిస్థితుల్లో నిలబెట్టుకోవాలని,ఆమ్ ఆద్మీ వైపుకి ఓటర్లు మళ్లకుండా చూసే ప్రయత్నాలను కొనసాగిస్తుంది. ఇందులో భాగంగానే ఇవాళ ఢిల్లీ సీఎం నివాసం వద్ద ఢిల్లీ గెస్ట్ టీచర్లు చేసిన నిరసనలో సిద్ధూ పాల్గొన్నారు.

ALSO READ Nagaland Firing : నాగాలాండ్ లో ఆర్మీ కాల్పులు..13 మందికి చేరిన మృతుల సంఖ్య