కొన్ని పార్టీలు పాక్‌లా మాట్లాడుతున్నాయి: మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్‌లో కొన్ని పార్టీలు పాకిస్తాన్ భాష మాట్లాడుతున్నాయని అన్నారు. సిటిజన్‌షిప్ బిల్లును ప్రవేశపెట్టినందుకుగానూ ప్రతిపక్షాల నుంచి మోడీ ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ మేర మోడీ స్పందిస్తూ.. ‘సిటిజన్‌షిప్ బిల్లులో స్వర్ణాక్షరాలతో రాసి ఉంది. మతపరంగా హింసను ఎదుర్కొంటున్న వారికి ఇది శాశ్వత విముక్తి కల్పిస్తుంది’ అని మోడీ తెలిపారు.
ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్.. బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. 2015కు ముందు భారత్‌లోకి పాకిస్తాన్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్‌ల నుంచి వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం సులువుగా దొరుకుతుందని ఆరోపించింది. ఇది వివక్ష చూపడమేనని వ్యతిరేకిస్తుంది. జాతిలో విభేదాలు సృష్టించడానికే ఇటువంటివి చేస్తున్నారని విమర్శిస్తుంది.
రాష్ట్రాల్లో బిల్లుపై వ్యతిరేకిస్తూ ఆందోళనలు మొదలయ్యాయి. ప్రతిపాదించిన బిల్లు కారణంగా పక్కనే ఉన్న బంగ్లాదేశ్‌తో వివాదాలు సంభవిస్తాయని అంటున్నారు. సోమవారం అర్ధరాత్రి లోక్‌సభలో ఏడుగంటలపాటు చర్చల అనంతరం పాస్ అయింది. బిల్లుకు 334ఓట్లు అనుకూలంగా రాగా 106ఓట్లు వ్యతిరేకంగా వచ్చాయి.