సోనియా, మాయావతికి భారతరత్న ఇవ్వాలి – హరీష్ రావత్

sonia-gandhi-mayawati : యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ, బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) చీఫ్ మాయావతికి భారతరత్న ఇవ్వాలని కాంగ్రెస్ నేత హరీష్ రావత్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ఆల్ ఇండియా కమిటీ (AICC) జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఈయన పని చేసిన సంగతి తెలిసిందే. సోనియా, మాయావతిలు చురుకైన రాజకీయ నాయకులుగా వెల్లడించారాయన. దశాబ్దాలుగా అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం మాయావతి కృషి చేస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. వారిపై ప్రశంసలు కురిపిస్తూ..భారత రత్న ఇవ్వాలని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేస్తున్ననట్లు తెలిపారు. సోనియా భారతీయ మహిళ అని, అంకితభావంతో ప్రజా సేవ చేస్తున్నారని తెలిపారు.
2019 సంవత్సరంలోభారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే నానాజీ దేశ్ ముఖ్, భూపెన్ హజారికాలకు మరణానంతరం దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నను ప్రకటించారు. ఈ పౌర పురస్కారం కళ, సాహిత్య, విజ్ఞాన, క్రీడా రంగాలలో అత్యుత్తమ కృషికి ప్రధానం చేస్తారు. ఇప్పటివరకు నలభై మందికి ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. 1954లో భారతరత్నను ప్రవేశపెట్టారు. ఈ అవార్డు అందుకున్న మొట్టమొదటి భారతీయుడు, ప్రసిద్ధ శాస్త్రవేత్త చంద్రశేఖర వెంకటరామన్. ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, ప్రముఖ శాస్త్రవేత్త ప్రొఫెసర్ సిఎన్ రావు కూడా భారతరత్న అందుకున్న వారిలో ఉన్నారు. హరీష్ రావత్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
आदरणीय #सोनिया_गांधी जी व सम्मानित बहन #मायावती जी, दोनों प्रखर राजनैतिक व्यक्तित्व हैं। आप उनकी राजनीति से सहमत और असहमत हो सकते हैं, मगर इस तथ्य से आप इनकार नहीं कर सकते हैं कि सोनिया जी ने भारतीय महिला की गरिमा और सामाजिक समर्पण व जनसेवा के मापदंडों को एक नई ऊंचाई व pic.twitter.com/FaFfHOf355
— Harish Rawat (@harishrawatcmuk) January 5, 2021
गरिमा प्रदान की है, आज उन्हें भारत की नारीत्व का गौरवशाली स्वरूप माना जाता है। सुश्री मायावती जी ने वर्षों से पीड़ित-शोषित लोगों के मन में एक अद्भुत विश्वास का संचार किया है, #भारत_सरकार को चाहिये कि इन दोनों व्यक्तित्वों को इस वर्ष का #भारत_रत्न देकर अलंकृत करें।@narendramodi
— Harish Rawat (@harishrawatcmuk) January 5, 2021