Special Trains : తమిళనాడు వెల్లంకి ఫెస్టివల్ – 2023కు ఎనిమిది ప్రత్యేక రైళ్లు
వెల్లంకి ఫెస్టివల్ దృష్ట్యా పెరిగే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆగస్టు27 నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు ప్రత్యేక రైళ్లు నడుస్తాయని తెలిపారు.

Special Trains Vellanki Festival : తమిళనాడులో నాగపట్నంలో ప్రతి ఏడాది నిర్వహించే వెల్లంకి ఫెస్టివల్ 2023 సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జోన్ 8 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయనుంది. పలు రైల్వే స్టేషన్ల నుంచి వెల్లంకి వరకు ఎనిమిది ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
వెల్లంకి ఫెస్టివల్ దృష్ట్యా పెరిగే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆగస్టు27 నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు ప్రత్యేక రైళ్లు నడుస్తాయని తెలిపారు. మరోవైపు పలు రైల్వే స్టేషన్ల మధ్య కొనసాగుతున్న మరమ్మతు పనులు కొనసాగుతుండంతో దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
Rahul Gandhi : వయానాడ్ పర్యటనకు బయలుదేరిన రాహుల్ గాంధీ
నాందేడ్ – ముంబాయి, ఆదిలాబాద్ – ఛత్రపతి శివాజీ మహారాజ టెర్మినస్, జాల్నా – ఛత్రపతి శివాజీ మహారాజ టెర్మినస్ రైల్వే స్టేషన్ల మధ్య కొనసాగుతున్న మరమ్మతు పనుల వల్ల ఆరు రైళ్లను రద్దు చేసినట్లు చెప్పారు.
ఈ ఆరు రైళ్లను ఆగస్టు13 నుంచి 15వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే సికింద్రాబాద్ – మన్మడ్, నాందేడ్ – బెంగళూరు స్టేషన్ల మధ్య 3 రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.