కాంగ్రెస్ నిర్ణయం సరైనదే..ప్రియాంకకు వెల్ కమ్ చెప్పిన అఖిలేష్

  • Published By: venkaiahnaidu ,Published On : January 27, 2019 / 10:28 AM IST
కాంగ్రెస్ నిర్ణయం సరైనదే..ప్రియాంకకు వెల్ కమ్ చెప్పిన అఖిలేష్

ప్రియాంక గాంధీ పొలిటికల్ ఎంట్రీపై  ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పందించారు. రాజకీయాల్లోకి కొత్తవాళ్లు ఎంత మంది వస్తే అంత సంతోషమని, సమాజ్ వాదీ పార్టీ ఎప్పుడు రాజకీయాల్లోకి వచ్చే కొత్తవారిని స్వాగతిస్తుందని   అఖిలేష్‌ అన్నారు. యూపీ తూర్పు ప్రాంతానికి ఏఐసీసీ జనరల్ సెక్రటరీ గా ప్రియాంక గాంధీని నియమిస్తూ కాంగ్రెస్‌ పార్టీ సరైన  నిర్ణయం తీసుకుందని అన్నారు.

మూడు రోజుల క్రితం అమేథీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. బీఎస్పీ-ఎస్పీలతో తమకెలాంటి వైరం లేదని, బీజేపీ తమకు కామన్ శత్రువని, తామందరం ఒకే లక్ష్యం కోసం పోరాడుతున్నామని చెప్పిన విషయం తెలిసిందే. మాయావతి, అఖిలేష్ ని తాను గౌరవిస్తానని అన్నారు. ఎస్పీ-బీఎస్పీలతో సంబంధాలు చెక్కుచెదరకుండానే రాహుల్ యూపీలో వ్యూహాత్మంగా అడుగులు వేస్తున్నారు. ఈ సమయంలో అఖిలేష్ ప్రియాంక పొలిటికల్ ఎంట్రీపై సానుకూలంగా స్పందించడం విశేషం. అయితే మాయావతి మాత్రం ఇప్పటివరకు ప్రియాంక పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి స్పందించలేదు.