ఇంకెన్నాళ్లీ వివక్ష: గుడిలోకి రానివ్వలేదని..ఎదురు తిరిగిన దళిత మహిళలు 

  • Published By: veegamteam ,Published On : October 31, 2019 / 10:18 AM IST
ఇంకెన్నాళ్లీ వివక్ష: గుడిలోకి రానివ్వలేదని..ఎదురు తిరిగిన దళిత మహిళలు 

Updated On : October 31, 2019 / 10:18 AM IST

కంప్యూటర్ యుగంలో కూడా కులాల వివక్ష కొనసాగుతోంది. దళితులను దేవాలయాలల్లోకి రాకుండా ఆంక్షలు విధిస్తున్న ఘటనలు జరుగుతున్నాయి. తాము దళితులమనీ గుడిలో రాకుండా అడ్డుకుంటున్నారనీ..కొంతమంది మహిళలు ఆవేదన వ్యక్తంచేశారు. గుడిలోకి వస్తున్న తమతో సదరు అగ్ర కులస్థులు దురుసుగా ప్రవర్తించటమే కాకుండా దూషిస్తున్నారని వాపోయారు. అక్టోబరు 25న జరిగిన యూపీలోని బులంద్ షహర్ జిల్లాలోని ఓ గ్రామంలో జరిగిన  ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది.  

బులంద్‌షహర్‌ జిల్లాలోని ఓ గ్రామంలోని ఓ ప్రముఖ ఆలయంలోకి వెళ్లేందుకు వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన మహిళలు ప్రయత్నించారు. అక్కడే ఉన్న ఇద్దరు అగ్ర కులస్తులు వారిని అడ్డుకున్నారు. గుడిలోకి రానిచ్చేది లేదంటూ ప్రధాన ద్వారానికి తాళం వేశారు. దీంతో వారికి మహిళలకు మధ్య వాగ్వాదం జరిగింది. 

దళితులుగా పుట్టినందుకు మమ్మల్ని ‘మమ్మల్ని చంపేస్తారా?  ఇది దేవాలయం. ఇక్కడ అందరూ పూజలు చేస్తారు. చేసుకోవచ్చు. మీరెంతగా భయపెట్టినా మేము భయంపడం..ఇక్కడ నుంచి కదలం. మీకు ఎంతమంది ఉన్నారో వారందరినీ తెచ్చుకోండి. చూద్దాం. ఎవరి సత్తా ఏంటో..అంటూ మహిళలు ఆ అగ్రకులస్థులకు గట్టి సమాధానమిచ్చారు. దీంతో  కులం పేరుతో దూషించిన సదరు వ్యక్తి వెనక్కి తగ్గాడు. మిమ్మల్ని నేను ఎందుకు ఎందుకు భయపెడతాను? ఇది ఠాకూర్లకు చెందిన గుడి. 

ఇక్కడ ఠాకూర్లు, బ్రాహ్మణులు మాత్రమే పూజలు చేస్తారు. మీరు మర్యాదగా మాట్లాడితే బాగుంటుంది’ అంటూ స్వరం తగ్గించి మాట్లాడుతూ..మాట మార్చాడు. అయినప్పటికీ గుడికి తాళం వేసి వాళ్లను లోపలికి రాకుండా అడ్డుకున్నారు. వాల్మీకి సామాజికవర్గ నాయకుడు విజేందర్‌ సింగ్‌ వాల్మీకి సహాయంతో ..సదరు మహిళలు పోలీసులకు  ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు  ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. 
ఈ సందర్బంగా విజేందర్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ఇంకెంత కాలం ఈ వివక్ష? అగ్ర కులస్తులు తమ పద్ధతిని మార్చుకోవాలని సూచించారు. వాళ్లు మమ్మల్ని హిందుత్వం నుంచి దూరం చేయాలని చూస్తున్నారు అంటూ ఆరోపించారు.
ఈ విషయంపై పోలీస్ సీనియర్ అధికారి అతుల్ శ్రీ వాస్తవ మాట్లాడుతూ..ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నామనీ తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.