రామమందిర ప్రారంభానికి వచ్చిన అతిథులకు ప్రత్యేక కానుకలు.. అందులో ఏమున్నాయో తెలుసా?
అయోధ్యలో అంగరంగ వైభవంగా జరిగిన ప్రాణప్రతిష్ఠ వేడుకకు దేశ విదేశాల నుంచి దాదాపు 7వేల మంది ప్రముఖులకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర టస్ట్ ఆహ్వానాలు అందించింది.

Ram Mandir
Ayodhya Ram Mandir inauguration : కొన్ని శతాబ్దాలుగా హిందువులు అయోధ్యలో రామాలయం నిర్మాణంకోసం ఎదురు చూశారు. సుదీర్ఘకాలంపాటు వారి నిరీక్షణ సోమవారం కార్యరూపం దాల్చింది. ధర్మానికి నిలువెత్తు రూపంగా నిలిచే శ్రీరామ చంద్రమూర్తి అయోధ్యలో కొలువుదీరారు. కోట్ల మంది భక్తుల మనసు పులకిస్తున్న వేళ, దేశమంతా రామనామ జపంతో తరిస్తుండగా.. సోమవారం మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా బాలరాముడికి గర్భగుడిలో ప్రాణప్రతిష్ఠ శాస్త్రోక్తంగా, అంగరంగవైభవంగా పూర్తయింది. శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన కోసం అయోధ్యకు అతిథులు తరలివచ్చారు.
అయోధ్యలో అంగరంగ వైభవంగా జరిగిన ప్రాణప్రతిష్ఠ వేడుకకు దేశ విదేశాల నుంచి దాదాపు 7వేల మంది ప్రముఖులకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర టస్ట్ ఆహ్వానాలు అందించింది. వారిలో రాజకీయ, సినీ, క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు ఉన్నారు. అయితే, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్న అతిథులకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రత్యేక ప్రసాదంతో పాటు కానుకలు అందించింది. అతిథులకు అందించిన కానుకల్లో.. లఖ్ నవూలో తయారు చేయించిన స్వీట్ బాక్సులతో పాటు కొన్ని వస్తువులను ఓ సంచిలో పెట్టి అతిథులకు అందించారు.
Also Read : David Warner : అయోధ్య రామ మందిర వేడుకపై పాకిస్తాన్, ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్స్ పోస్ట్..
అతిథులకు అందించిన సంచిపై కొత్త దేవాలయంతోపాటు బాలరాముడి అవతారంలో గ్రాఫిక్ చిత్రాన్ని ముద్రించారు. అందులో అయోధ్యపై పుస్తకం, దీపం కుంది, తలసిమాల, శ్రీరాముడి పేరుతో ఉన్న కండువా అందించారు. అంతేకాక.. నేతితో చేసిన నాలుగు లడ్డూలు, బెల్లం మిఠాయి, రామదాన చిక్కీ, జీడిపప్పు, కిస్మిస్ లు ప్రసాదంగా అందించారు.
Also Read : బాలరాముడి దర్శనం, హారతి పాస్‌లకు ఆన్‌లైన్ బుకింగ్ ఇలా చేసుకోండి.. పదేళ్లలోపు వారికి అయితే..