‘కమలా’ విజయం కోసం తమిళనాడులో ప్రత్యేక పూజలు

  • Published By: venkaiahnaidu ,Published On : November 3, 2020 / 11:48 AM IST
‘కమలా’ విజయం కోసం తమిళనాడులో ప్రత్యేక పూజలు

Updated On : November 3, 2020 / 12:39 PM IST

Special prayers offered at a temple at the native village of Kamala Harris అమెరికా ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరపున ఉపాధ్యక్ష పదవికి భారత సంతతికి చెందిన కమాలా హ్యారిస్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. నేడు జరుగుతున్న అమెరికా ఎన్నికల్లో కమలా హ్యారిస్ విజయం కోసం తమిళనాడులో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమిళనాడులోని తిరువరూర్ జిల్లాలోని కమలా హ్యారిస్ స్వగ్రామంలోని ఓ ఆలయంలో ఆమె విజయాన్ని ఆకాంక్షిస్తూ స్థానికులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆమె ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని తాము కోరుకుంటున్నామని..అందుకే ఆమె కోసం పూజలు చేస్తున్నట్లు స్థానికులు తెలిపారు.



కమలా హ్యారిస్.. పేరులోనే భారతీయత ఉంది. కమలా హ్యారిస్ మూలాలు మన దేశంలోనే ఉన్నాయి. ఆమె పూర్తి పేరు…కమలా దేవి హ్యారిస్. తల్లి పేరు శ్యామలా హ్యారిస్. శ్యామలా హ్యారిస్ చెన్నైలో పుట్టిపెరిగి… క్యాన్సర్ పరిశోధకురాలిగా అమెరికాలో స్థిరపడ్డారు. జమైకా దేశానికి చెంది…ఆఫ్రికన్ మూలాలు ఉన్న డొనాల్డ్ హ్యారిస్‌ను శ్యామల పెళ్లి చేరుకున్నారు. వాళ్ల కుమార్తే కమలా హ్యారిస్. చిన్నప్పుడే తల్లిదండ్రులు విడిపోవడంతో కమలా హ్యారిస్ తల్లి దగ్గరే పెరిగారు.



తల్లి ఇండియన్.. తండ్రి ఆఫ్రికన్ కావడంతో.. రెండు దేశాల సంప్రదాయాలు కమలా హ్యారిస్‌లో కనిపిస్తాయి. కాలిఫోర్నియాలో ఇండో ఆఫ్రికన్ అమెరికన్‌గా పుట్టిన కమలా హ్యారిస్.. డెమొక్రటిక్ పార్టీలో కీలక స్థాయికి ఎదిగారు. తల్లి శ్యామలా గోపాలన్‌తో కలిసి అనేకసార్లు చెన్నై వచ్చారు. తన పేరులోనే కమలం ఉందని… భారతీయ సంప్రదాయాల్లో దానికి ఎంతో విలువ ఉందంటూ ఆటోబయోగ్రఫీలో రాసుకున్నారు కమలా హ్యారిస్.



https://10tv.in/hero-electric-festive-offers-up-to-rs-5000-cash-discount-other-benefits-on-e-scooters/
గతేడాది వరకు కమలా.. అధ్యక్ష అభ్యర్థిగా ఉన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో డొమొక్రటిక్ పార్టీ నుంచి నామినేషన్ పొందేందుకు కమలా హ్యారిస్ తీవ్రంగానే ప్రయత్నించారు. అయితే పార్టీ అంతర్గత డిబేట్స్‌లో జో బైడెన్ కంటే వెనుకపడ్డారు. డెమొక్రటిక్ పార్టీలో తనతో పోటీపడిన… కమలా హ్యారిస్‌కే ఉపాధ్యక్ష పదవి కట్టపెట్టాలని నిర్ణయించుకున్నారు జో బైడెన్. బిడెన్ తనతోపాటు పోటీ చేసేందుకు అంగీకరించడంతో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చారు.