Sputnik V Vaccine : స్పుత్నిక్ వ్యాక్సిన్ గ్లోబల్ రేటు రూ.750.. ఇండియాలో ధరపై క్లారిటీ ఇచ్చిన రెడ్డీస్ ల్యాబ్
మన దేశంలో ఇప్పటి వరకు రెండు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటి సీరమ్ ఇన్ స్టిట్యూట్ తయారు చేస్తున్న కొవిషీల్డ్, భారత్ బయోటెక్ ఉత్పత్తి చేస్తున్న కొవాగ్జిన్. ఇటీవలే మూడో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. రష్యాకు చెందిన స్పుత్నిక్ వి కోవిడ్ వ్యాక్సిన్ వినియోగానికి భారత ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ టీకాను డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ అందుబాటులోకి తీసుకొస్తోంది. కాగా, వ్యాక్సిన్ ఒక్కో డోసు ధర రూ. 750 వరకు ఉంటుందని దేశీయ తయారీదారు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ వెల్లడించింది. ఈ ప్రకటన చేసిన 24 గంటల తర్వాత..

Sputnik V Vaccine
Sputnik V Vaccine Price : మన దేశంలో ఇప్పటి వరకు రెండు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటి సీరమ్ ఇన్ స్టిట్యూట్ తయారు చేస్తున్న కొవిషీల్డ్, భారత్ బయోటెక్ ఉత్పత్తి చేస్తున్న కొవాగ్జిన్. ఇటీవలే మూడో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. రష్యాకు చెందిన స్పుత్నిక్ వి కోవిడ్ వ్యాక్సిన్ వినియోగానికి భారత ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ టీకాను డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ అందుబాటులోకి తీసుకొస్తోంది. కాగా, వ్యాక్సిన్ ఒక్కో డోసు ధర రూ. 750 వరకు ఉంటుందని దేశీయ తయారీదారు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ వెల్లడించింది. ఈ ప్రకటన చేసిన 24 గంటల తర్వాత.. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్.. టీకా ధరపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఇంకా టీకా ధర నిర్ణయించలేదని, దీనిపై చర్చలు జరుగుతున్నాయని, ఇంకా తుది నిర్ణయం తీసుకోలేని చెప్పింది.
‘స్పుత్నిక్ వి వ్యాక్సిన్ గ్లోబల్ ధర 10డాలర్లు(రూ.750)గా ఉంది. మన దేశంలో టీకా ధర ఎంత ఉంచాలి అనే దానిపై మేము ఇంకా చర్చలు జరుపుతున్నాం. దీనికి సంబంధించి ఏదైనా డెవలప్ మెంట్ ఉంటే మేము అప్ డేట్ ని షేర్ చేస్తాము’ అని డాక్టర్ రెడ్డీస్ ఓ ప్రకటనలో తెలిపింది.
తాజాగా రష్యాకు చెందిన స్పుత్నిక్ వి కోవిడ్ వ్యాక్సిన్ ను డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ అందుబాటులోకి తీసుకొస్తోంది. వ్యాక్సిన్ ఒక్కో డోసు రూ. 750 వరకు ఉంటుందని డాక్టర్ రెడ్డీస్ వెల్లడించింది. మే-జూన్ నెలలో దిగుమతుల ద్వారా లక్ష వ్యాక్సిన్ డోసులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని డాక్టర్ రెడ్డీస్ ఎండీ జీవీ ప్రసాద్ తెలిపారు.
కాగా, నిన్న(ఏప్రిల్ 21,2021) డాక్టర్ రెడ్డీస్ ఎండీ జీవీ ప్రసాద్ మాట్లాడుతూ.. మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన అందరికీ కొవిడ్ వ్యాక్సిన్ ఇస్తుండటంతో స్పుత్నిక్ వి అందుబాటులోకి రావడం ఊరట కలిగించే విషయమే. ఇక ఈ వ్యాక్సిన్ డోసు గరిష్ఠ ధర మాత్రం పది డాలర్లే ఉంటుంది. దిగుమతి అయ్యే వ్యాక్సిన్‌లు మొదట కేవలం ప్రైవేట్ మార్కెట్ కోసమే. వ్యాక్సిన్ మొత్తాన్ని ప్రైవేట్ మార్కెట్ కే తరలిస్తాం. ప్రపంచ మార్కెట్ కు తగ్గట్టుగానే భారత్ లో కూడా వ్యాక్సిన్ ధర ఉండాలని మా భాగస్వామి సంస్థ కోరింది.
వ్యాక్సిన్ గ్లోబల్ ధర 10 డాలర్లుగా ఉంది. మన కరెన్సీలో కూడా అదే ధరకు వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది. ఇండియాలో తయారీని ప్రారంభించిన తర్వాత పరిస్థితులను బట్టి అప్పటి ధరలపై నిర్ణయం తీసుకుంటాం. ఇక్కడ తయారీ ప్రారంభించిన తర్వాత పబ్లిక్ మార్కెట్‌లకు కూడా వ్యాక్సిన్ ఇస్తాం. మొదట్లో స్పుత్నిక్ వి దిగుమతుల తర్వాత డాక్టర్ రెడ్డీస్ వాటిని ఇక్కడే పూర్తి స్థాయిలో తయారు చేయనుంది. ఇండియాలో వాటి తయారీ ప్రారంభమైన తర్వాత ధర తగ్గే అవకాశం ఉంది. కరోనా మ్యుటెంట్లపై కూడా స్పుత్నిక్ వ్యాక్సిన్ ప్రభావం చూపుతుంది” అని జీవీ ప్రసాద్ అన్నారు.
మే-జూన్ నాటికి కొన్ని లక్షల డోసుల వ్యాక్సిన్‌లు దిగుమతి అవుతాయని ఆయన తెలిపారు. కొవిషీల్డ్, కొవాగ్జిన్ తర్వాత ఇండియాలో అనుమతి పొందిన మూడో కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్ వి. అయితే ఇప్పటి వరకూ ఉన్న వ్యాక్సిన్లలో స్పుత్నిక్ వి దే అత్యధిక ధర కావడం గమనార్హం. కొవిషీల్డ్‌ను ప్రైవేట్ మార్కెట్‌లో రూ.600కు, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.400కు ఇస్తామని సీరమ్ ప్రకటించిన విషయం తెలిసిందే. కేంద్రానికి ఇప్పటికీ రూ.150కే డోసు లెక్కన ఈ సంస్థ పంపిణీ చేస్తోంది.