TVK Whistle: విజయ్‌కి విజిల్ ఇచ్చిన ఎన్నికల సంఘం..
పొత్తు కోసమే బీజేపీ.. విజయ్ ని వేధిస్తుందనే ప్రచారం కూడా తమిళనాట బలంగా సాగింది. అందుకే విజయ్ ని సీబీఐ విచారణ పేరిట వేధిస్తున్నారనే పుకార్లు కూడా వచ్చాయి.
TVK Whistle Representative Image (Image Credit To Original Source)
- తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం గుర్తులు కేటాయించిన కేంద్ర ఎన్నికల సంఘం
- హీరో విజయ్ తమిళగ వెట్రి కగజం పార్టీకి విజిల్ గుర్తు కేటాయింపు
- జయ్ పార్టీతో పొత్తు కోసం బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నాలు
TVK Whistle: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తులను కేటాయిస్తోంది. నటుడు విజయ్ సారధ్యంలో కొత్తగా పెట్టిన తమిళగ వెట్రి కగజం పార్టీకి కూడా ఈసీ గుర్తును కేటాయించింది. టీవీకేకి విజిల్ గుర్తును కేటాయించింది. ఇటీవల టీవీకే పార్టీ 12 మంది సభ్యులతో ఎన్నికల క్యాంపెయిన్ నిర్వహణకు సంబంధించి కో ఆర్డినేషన్ కమిటీని నియమించింది. పార్టీ మేనిఫెస్టోను రెడీ చేసేందుకు ఆ కమిటీ రెడీ అయింది. సామాజిక న్యాయం, పారదర్శకత నినాదంతో ఎన్నికలకు వెళ్లనుంది.
తమిళనాడు సమగ్ర అభివృద్ధి, అన్ని రంగాలు అభివృద్ధి చెందాలనే నినాదంతో ముందుకు వెళ్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. డీఎంకే అధికారంలో ఉండగా, అన్నాడీఎంకే ప్రతిపక్షంలో ఉంది. కానీ, అందరి చూపు కొత్తగా పెట్టిన టీవీకే మీదే ఉంది. తమిళనాడులో విజయ్ పార్టీతో పొత్తు కోసం బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నాలు చేసినట్టు వార్తలు వచ్చాయి.
పొత్తు కోసమే బీజేపీ.. విజయ్ ని వేధిస్తుందనే ప్రచారం కూడా తమిళనాట బలంగా సాగింది. అందుకే విజయ్ ని సీబీఐ విచారణ పేరిట వేధిస్తున్నారనే పుకార్లు కూడా వచ్చాయి. కానీ, పొత్తులపై ఎలాంటి ప్రకటనలు రాలేదు.
తమిళనాడులో ప్రాంతీయ పార్టీలు గుర్తులు
అన్నా డీఎంకే – రెండు ఆకులు
డీఎంకే – ఉదయించే సూర్యుడు
డీఎండీకే – ఢమరుకం
వీసీకే – కడవ
ఎంఎన్ఎం – టార్చ్ లైట్
తమిళనాడులో మొత్తం సీట్లు 234
మేజిక్ ఫిగర్ 118
జనరల్ సీట్లు 188
ఎస్సీ రిజర్వ్ డ్ 44
ఎస్టీ రిజర్వ్ డ్ 2
అధికార పార్టీల (కూటమి) సంఖ్యాబలం
డీఎంకే 132
కాంగ్రెస్ 17
వీసీకే 4
సీపీఎం 2
సీపీఐ 2
Total – 157
ప్రతిపక్ష పార్టీల సంఖ్యాబలం
అన్నాడీఎంకే 60
బీజేపీ 4
పీఎంకే 3
Total – 67
Also Read: బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. వరుసగా ఫోర్ డేస్ బ్యాంకులు బంద్.. ఎందుకు.. ఏఏ రోజుల్లో అంటే?
