Stock Market : భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ లాభాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన బెంచ్ మార్క్ సూచీలు 1 శాతానికి పైగా లాభపడ్డాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) ఇండెక్స్ సెన్సెక్స్ 765

Stock Market
Stock Market : దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ లాభాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన బెంచ్ మార్క్ సూచీలు 1 శాతానికి పైగా లాభపడ్డాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) ఇండెక్స్ సెన్సెక్స్ 765.04 పాయింట్లు (1.36%) లబ్దిపొంది 56,958 దగ్గర స్థిరపడితే, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 225.80 పాయింట్లు (1.35%) లాభపడి 16,931 దగ్గర ముగిసింది. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.73.28 దగ్గర నిలిచింది. అంతర్జాతీయ సానుకూల పవనాలు, రూపాయి బలపడడం, ఎఫ్‌డీఐల వెల్లువతో సూచీలు దూసుకెళ్లాయి.
SSC GD Constable 2021 : పది పాస్ అయితే చాలు, 25 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు.. రేపే లాస్ట్ డేట్
గ్లోబల్ మార్కెట్ల నుండి సానుకూల సూచనల మధ్య స్టాక్ మార్కెట్ నేడు ఆల్-టైమ్ గరిష్టాన్ని తాకింది. రోజంతా ఒడిదుడుకుల తరువాత స్టాక్ మార్కెట్ చివరకి లాభాలతో ముగిసింది.
భారతీ ఎయిర్ టెల్, దివిస్ ల్యాబ్స్, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, కోల్ ఇండియాలు నిఫ్టీలో అగ్రస్థానంలో ఉన్నాయి. టెక్ మహీంద్రా, ఐచర్ మోటార్స్, నెస్లే, ఇన్ఫోసిస్, టిసీఎస్ షేర్లు టాప్ లూజర్లలో ఉన్నాయి. ఐటీ మినహా ఇతర అన్ని సూచీలు లాభాలతో ముగిశాయి.
స్టాక్ మార్కెట్ గత వారం శుక్రవారం కూడా అత్యధిక స్థాయిలో ముగిసింది. సెన్సెక్స్ 175 పాయింట్లు పెరిగి 56,124.72 దగ్గర ముగిసింది. నిఫ్టీ 68.30 పాయింట్లు పెరిగి 16,705.20 రికార్డు స్థాయిలో ముగిసింది.
Covid-19 Variant C.1.2 : వ్యాక్సిన్లూ పనిచేయని కొత్త వేరియంట్ వెలుగులోకి!