స్కూల్‌ పిల్లలు పిక్నిక్‌కు వెళ్తుండగా బోల్తా పడ్డ బస్సు.. ఒక చిన్నారి మృతి.. పలువురికి గాయాలు

విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి ఐదు బస్సుల్లో పిక్నిక్ స్పాట్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు అన్నారు.

స్కూల్‌ పిల్లలు పిక్నిక్‌కు వెళ్తుండగా బోల్తా పడ్డ బస్సు.. ఒక చిన్నారి మృతి.. పలువురికి గాయాలు

Accident

Updated On : November 26, 2024 / 4:11 PM IST

హాయిగా పిక్నిక్‌కు వెళ్లి ఎంజాయ్‌ చేద్దామనుకున్నారు ఆ చిన్నారులు. రోడ్డుపై నుంచి స్కూల్‌ బస్సు వెళ్తుండగా ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఓ చిన్నారిని ప్రాణాలు కోల్పోగా, మరికొంత మందికి తీవ్రగాయాలయ్యాయి.

గాయాలపాలైన వారిలో టీచర్లు కూడా ఉన్నారు. ఈ ఘటన ఇవాళ మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలో చోటుచేసుకుంది. కొండ ప్రాంతంలోని హింగాని రోడ్డులోని డియోలి పెంధారి గ్రామ సమీపం నుంచి సుమారు 50 మందితో బస్సు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

హింగ్నా పోలీస్ స్టేషన్‌ అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఆ స్కూల్‌ బస్సు శంకర్ నగర్ ప్రాంతంలోని సరస్వతి హైస్కూల్‌కు చెందిందని అధికారులు వివరించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి ఐదు బస్సుల్లో వార్ధా జిల్లాలోని పిక్నిక్ స్పాట్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అన్నారు.

మృతి చెందిన బాలుడు 7వ తరగతి విద్యార్థి అని పోలీసులు చెప్పారు. ఒక బాలిక, ఓ ఉపాధ్యాయుడి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. వారిని నాగ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు తరలించారు. మరికొందరిని సమీపంలోని గ్రామీణ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Rahul Gandhi: వారి గురించి ఎవరు మాట్లాడినా మైక్‌ ఆఫ్‌ అవుతోంది: రాహుల్ గాంధీ