Hijab Row: బొట్టు తుడిచేస్తేనే కాలేజిలోకి ఎంట్రీ.. స్టూడెంట్‌కు కర్ణాటక కాలేజీ కౌంటర్

బొట్టు పెట్టుకున్న వ్యక్తి కాలేజీ పరిసరాల్లోకి ఎంటర్ కాకుండా అడ్డుకుంది యాజమాన్యం. నుదుటి మీద ఉన్న బొట్టును తొలగిస్తేనే అనుమతిస్తామని చెప్పడంతో కాసేపు వాగ్వాదం జరిగింది.

Hijab Row: బొట్టు తుడిచేస్తేనే కాలేజిలోకి ఎంట్రీ.. స్టూడెంట్‌కు కర్ణాటక కాలేజీ కౌంటర్

Hijab Row

Updated On : February 19, 2022 / 7:36 AM IST

Hijab Row: బొట్టు పెట్టుకున్న వ్యక్తి కాలేజీ పరిసరాల్లోకి ఎంటర్ కాకుండా అడ్డుకుంది యాజమాన్యం. నుదుటి మీద ఉన్న బొట్టును తొలగిస్తేనే అనుమతిస్తామని చెప్పడంతో కాసేపు వాగ్వాదం జరిగింది. ముందు నుదుటిపై ఉన్న బొట్టును తొలగించు… లేదంటే లోపలికి వెళ్లనివ్వమంటూ లెక్చరర్లు విద్యార్థిని ఆపేశారు.

ఇది తమ సంప్రదాయమని చెప్పినప్పటికీ హిజాబ్ ధరించడం, కాషాయం కండువాలపై విధించిన నిబంధనల నేపథ్యంలో సమస్యను సృష్టిస్తుందని చెప్పారు. చాలాసేపటి వరకూ దీనిపై సీరియస్ డిస్కషన్ జరిగిందని తోటి విద్యార్థులు చెబుతున్నారు.

రాష్ట్రంలో మొదలైన హిజాబ్ వివాదం నేపథ్యంలో కర్ణాటక హైకోర్టు విచారణ కొనసాగిస్తూ.. అప్పటివరకూ హిజాబ్, కాషాయ కండువాలు ధరించకూడదంటూ ఆంక్షలు విధించింది. నుదుటి మీద బొట్టుకుని వస్తే ఆ ఆదేశాలు ధిక్కరించినట్లే అవుతుందని చెబుతుంది కాలేజీ యాజమాన్యం.

Read Also : సమస్యను పెద్దది చేయొద్దు..’హిజాబ్’​ వివాదంలో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ

హైకోర్టులో జరుగుతున్న వాదనలో హిజాబ్ అనేది అమాయకపు మతతత్వ చర్య మాత్రమేనని నుదుటిపై బొట్టు, కంకణాలు, సిక్కుల తలపాగా, రుద్రాక్షలు ధరించడం వంటిదేనని అంశాలు వినిపిస్తున్నాయి.