డిగ్రీ పట్టాలు తీసుకోకుండా…CAA కాపీ చించేసిన యూనివర్శిటీ విద్యార్థులు

  • Published By: venkaiahnaidu ,Published On : December 25, 2019 / 10:55 AM IST
డిగ్రీ పట్టాలు తీసుకోకుండా…CAA కాపీ చించేసిన యూనివర్శిటీ విద్యార్థులు

Updated On : December 25, 2019 / 10:55 AM IST

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. పలుచోట్ల విద్యార్థులు కూడా రోడ్లపైకి వచ్చి తమ నిరసన తెలుపుతున్నారు. మరికొ్ందరు వినూత్నంగా తమ నిరసనలను తెలియజేస్తున్నారు. ఇటీవల కేరళలో ఓ జంట పెళ్లి కార్యక్రమంలో నో సీఏఏ,నో ఎన్ఆర్సీ ప్లక్లార్డ్ లు పట్టుకుని నిరసన తెలియజేయగా, ఆ తర్వాత మరో జంట అందరినీ ఆలోచింపచేపేతా ప్రీవెడ్డింగ్ షూట్ లో సీఏఏ,ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ప్లకార్డ్ లను ప్రదర్శించి తమ నిరసనను తెలియజేశారు. అయితే ఇప్పుడు మరో యువతి తన స్టైల్ లో నిరసన తెలియజేసి వార్తల్లోకెక్కింది.

కోల్ కతాలోని జాదవ్ పూర్ యూనివర్శిటీలో సోమవారం(డిసెంబర్-23,2019)స్నాతకోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గోల్డ్ మెడల్ తో పాటుగా ఎంఏ డిగ్రీ అందుకునేందుకు దెబోస్మిత చౌధురిని వేదికపైకి పిలిచారు. స్టేజ్ పైకి వెళ్లిన దెబోస్మిత తన గోల్డ్ మెడల్ ను అందుకుంది. ఆ తర్వాత ఎంఏ డిగ్రీని దెబోస్మిత అందుకోవాల్సి ఉంది. అయితే ఏంఏ డిగ్రీ అందుకునే ముందు తన వెంట తెచ్చుకున్న పౌరసత్వ సవరణ చట్టం కాపీని అందరిముందు చించివేసింది. మేము ఐడీలు చూపించం.ఇంక్విలాబ్ జిందాబాద్ అందూ స్టేజీపైనే నినాదాలు చేసింది.

ఆ తర్వాత వెళ్లి తన ఎంఏ డిగ్రీని అందుకుంది. వైస్ ఛాన్సలర్,ప్రో వైస్ ఛాన్సలర్,రిజిస్ట్రార్ అందరూ కూర్చున్నచోటనే తన నిరసన తెలియజేయాలనుకున్నట్లు దెబోస్మిత తెలిపింది. జాదవ్ పూర్ యూనివర్శిటీ పట్ల తాను అగౌరవం ప్రవర్తించడం లేదని,తన నిరసనకు పోడియంను వేదికగా మాత్రమే చేసుకున్నానని దెబోస్మిత తెలిపింది. మరికొందరు తన మిత్రులయితే సీఏఏకి నిరసనగా డిగ్రీ పట్టాలు తీపుకునేందుకు కూడా నిరాకరించినట్లు తెలిపింది. అయితే అంతకుముందు యూనివర్శిటీలో జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరయ్యేందకు యూనివర్శిటీలోకి వెళ్లేందుకు యత్నించిన వెస్ట్ బెంగాల్ గవర్నర్ జగ్ దీప్ ధనకర్ కారుని ఆందోళనకారులు అడ్డుకున్న విషయం తెలిసిందే.