మొత్తం కృష్ణ జన్మభూమిని మాకప్పగించండి, అయోధ్యను మించిన గుడి కడతాం

Shri Krishna Janmabhoomi land: అయోధ్య రామ్ మందిర తీర్పు కొందరకి ధైర్యమిస్తున్నట్లే ఉంది. మధుర పట్టణంలోని మొత్తం కృష్ణ జన్మభూమి మాదే, తిరిగి అప్పగించడంటూ మధుర సివిల్ కోర్టులో తాజా దావా దాఖలైంది. శ్రీకృష్ణ జన్మభూమి పక్కనే షాహి ఈద్గా మసీదుంది. దాన్ని తొలగించి మొత్తం భూమిని అప్పగించాలంటూ ‘భగవాన్ శ్రీ కృష్ణ విరాజ్మన్’ తరపున మధుర కోర్టులో దావా వేశారు. రాయల్ ఇద్గా మసీదు ఉన్న ప్రదేశం శ్రీకృష్ణుడు జన్మించిన కారాగారమని దావాలో వాదించారు.
13.37 ఎకరాల ‘శ్రీ కృష్ణ జన్మభూమి’ ప్రక్కనే ఉన్న షాహి ఈద్గా మసీదును తొలగించాలన్నది డిమాండ్. ఈ భూమి యొక్క ప్రతి అంగుళం, శ్రీ కృష్ణుడి భక్తులకు, హిందువులకు పవిత్రమైనదని ‘భగవాన్ శ్రీ కృష్ణ విరాజ్మన్’ కొద్దికాలంగా వాదిస్తోంది.