Sukesh Chandrasekhar : ఎమ్మెల్సీ కవితతో చాటింగ్..! సుకేశ్ చంద్రశేఖర్ మరో సంచలనం
Sukesh Chandrasekhar: ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం తాను బయటపెట్టిన చాట్స్ ఆధారంగా దర్యాఫ్తు కొనసాగించాలని డిమాండ్ చేశాడు.

Sukesh Chandrashekhar
Sukesh Chandrasekhar : మనీలాండరింగ్ కేసులో జైల్లో ఉన్న సుకేశ్ చంద్రశేఖర్.. వాట్సాప్ చాట్ ను బయటపెట్టాడు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో చేసిన చాటింగ్ అంటూ స్క్రీన్ షాట్లు బయటపెట్టాడు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అయితే, ఈ చాట్ తెలుగులో ఉండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వార్తలను బీఆర్ఎస్ వర్గాలు ఖండించాయి.
మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ జైల్లో ఉన్న సుకేశ్ చంద్రశేఖర్ రెండు చాట్స్ ను బయటపెట్టాడు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్ తో తనకున్న సంబంధాలు, అలాగే వారికి బీఆర్ఎస్ పార్టీతో ఉన్న సంబంధాలు.. వీటన్నింటికి సంబంధించి చాట్స్ లో ప్రస్తావించడం జరిగింది. ఈ చాట్స్ ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, కేంద్రహోంమంత్రి, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, సీబీఐ, ఈడీలకు కూడా పంపించాడు.(Sukesh Chandrasekhar)
ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం తాను బయటపెట్టిన చాట్స్ ఆధారంగా దర్యాఫ్తు కొనసాగించాలని, టీఆర్ఎస్ ఆప్ నేతల మధ్య జరిగిన అక్రమా లావాదేవీలకు సంబంధించిన అంశాలపై విచారణ చేయాలని సుకేశ్ చంద్రశేఖర్ డిమాండ్ చేశాడు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లోనూ ఈ ఎవిడెన్స్ ఉపయోగపడుతుందని చాట్స్ విడుదల సందర్భంగా లేఖలో పేర్కొన్నాడు సుకేశ్ చంద్రశేఖర్.
ఇందులో ఉన్న కోడ్ నేమ్స్ కూడా అందులో మెన్షన్ చేశాడు. అందులో కవిత అక్క, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పేరు పేర్కొన్నాడు. 15 కేజీల ఘీ(నెయ్యి) అంటే రూ.15 కోట్లు, 25 కేజీల నెయ్యి అంటే రూ.25 కోట్లు.. ఇలా కోడ్ నేమ్స్ సైతం అందులో ప్రస్తావించాడు. ఏకేజీ అంటే.. అరవింద్ కేజ్రీవాల్ జీ, ఏపీ అంటే అరుణ్ పిళ్లై అనే కోడ్ నేమ్స్ అందులో ప్రస్తావించాడు.
కాగా, ఈ చాట్స్ ని బీఆర్ఎస్ నేతలు తోసిపుచ్చారు. కవితక్క అని ప్రస్తావించడం, అరవింద్ కేజ్రీవాల్ సూచనల మేరకు మీకు డబ్బులివ్వమన్నారు అని చాట్స్ లో పేర్కొనడం, అరుణ్ పిళ్లై ఈ వ్యవహారాన్ని అంతా చూశారు, అలాగే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం(హెచ్ క్యూ) ఇలా కోడ్ నేమ్స్ లో చాట్స్ లో ప్రస్తావించాడు. ఈ చాట్స్ లో నిజం లేదని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. తెలుగులో చాటింగ్ ఉండటంపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.(Sukesh Chandrasekhar)