లిక్కర్ కేసు డబ్బు ఎక్కడుందో రేపు కేజ్రీవాల్ కోర్టులో చెబుతారు! : సునీతా కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈడీ కస్టడీలోని అరవింద్ కేజ్రీవాల్ సందేశాన్ని

sunitha kejriwal
Arvind Kejriwal Wife : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈడీ కస్టడీలోని అరవింద్ కేజ్రీవాల్ సందేశాన్ని ప్రజలకు వీడియో ద్వారా ఆమె వివరించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆప్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. ఈ వీడియోలో సునీత కేజ్రీవాల్ మాట్లాడిన వివరాల ప్రకారం.. మంగళవారం సాయంత్రం ఈడీ కస్టడీలో కేజ్రీవాల్ ను కలిశాను. కేజ్రీవాల్ కు డయాబెటిస్ ఉంది. షుగర్ లెవల్ సరిగా లేదు. కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో దృఢంగా ఉన్నారని ఆమె పేర్కొన్నారు.
Also Read : Arvind Kejriwal : జైల్లో కేజ్రీవాల్ ఆఫీసు ఏర్పాటుకు కోర్టును ఆశ్రయిస్తాం : భగవంత్ మాన్
రెండు రోజుల క్రితం ఢిల్లీ ప్రజల నీటి సమస్యలు, మురుగు నీటి సమస్యలు పరిష్కరించాలని అతిశీకి సూచనలు చేశారు. ఈడీ కస్టడీలో ఉన్నా ప్రజల సమస్యల గురించి కేజ్రీవాల్ ఆలోచిస్తున్నారని సునీతా కేజ్రీవాల్ అన్నారు. ప్రజా సమస్యల గురించి ఆలోచిస్తున్న కేజ్రీవాల్ పై కేంద్ర ప్రభుత్వం కేసులు పెడుతుంది. ఢిల్లీని అణిచివేయాలని, ప్రజలు నిత్యం సమస్యల్లో ఉండాలని చూస్తున్నారా? అంటూ కేంద్రాన్ని ప్రశ్నించారు. గడిచిన రెండేళ్లలో ఈడీ 250పైగా ప్రాంతాల్లో సోదాలు చేసింది. లిక్కర్ కేసులో ఇప్పటి వరకు జరిగిన సోదాల్లో ఒక్క పైసా దొరకలేదు. సిసోడియా, సంజయ్ సింగ్, సత్యేందర్ జైన్ నివాసంలో ఒక్కపైసా దొరకలేదని సునీత కేజ్రీవాల్ అన్నారు.
లిక్కర్ కేసు డబ్బు ఎక్కడుందో రేపు (28న) కేజ్రీవాల్ కోర్టులో దేశ ప్రజలకు చెబుతారు. దాని ఆధారాలు కూడా చెబుతారంటూ సునీతా కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అరవింద్ కేజ్రీవాల్ నిజమైన దేశ భక్తుడు. కేజ్రీవాల్ తన శరీరం జైల్లో ఉన్నా.. ఆత్మ ప్రజల్లోనే ఉందంటూ ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్ అన్నారు.
https://twitter.com/AamAadmiParty/status/1772873570068074776?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1772873570068074776%7Ctwgr%5Ea5cb858ca130f7aa8a7dfe5e2d6acc9f7fab4d82%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.amarujala.com%2Fdelhi-ncr%2Fdelhi-chief-minister-arvind-kejriwal-wife-sunita-kejriwal-will-issue-a-press-statement-today-live-update-2024-03-27