Detergents, Soap Prices : మరో షాక్.. రూ.14 పెంపు.. సబ్బులు, డిటర్జెంట్ల ధరల మోత

అసలే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగిపోయాయి. చుక్కలను తాకే ధరలతో సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారు. బతుకు భారంగా మారింది. జీవనం ఎలాగో తెలియక కామన్ మ్యాన్ ఆందోళన చెందుతున్నాడు. ఇ

Detergents, Soap Prices : మరో షాక్.. రూ.14 పెంపు.. సబ్బులు, డిటర్జెంట్ల ధరల మోత

Detergents, Soap Prices

Updated On : September 7, 2021 / 10:39 PM IST

Detergents, Soap Prices : అసలే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగిపోయాయి. చుక్కలను తాకే ధరలతో సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారు. బతుకు భారంగా మారింది. జీవనం ఎలాగో తెలియక కామన్ మ్యాన్ ఆందోళన చెందుతున్నాడు. ఇది చాలదన్నట్టు మరో భారం పడింది. సబ్బులు, డిటర్జెంట్ల ధరలు మరింత పెరగనున్నాయి. హిందూస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ (హెచ్ యుఎల్) తన ఉత్పత్తుల ధరలు పెంచింది. సర్ఫ్ ఎక్సెల్, రిన్, వీల్ డిటర్జెంట్, లక్స్ వంటి ఉత్పత్తుల ధరలు పెంచుతున్నట్టు వెల్లడించింది. వీల్ డిటర్జెంట్ కిలో, అరకిలో ప్యాక్ లపై 3.5 శాతం పెంచనుంది. అటు, ఇప్పటివరకు కిలో రూ.77లకు లభించిన రిన్ డిటర్జెంట్ పౌడర్ ఇకపై రూ.82 పలకనుంది.

Whatsappలో కొత్త ఫీచర్.. మీ కాంటాక్టులను ఇక కంట్రోల్ చేయొచ్చు!

అంతేకాదు, 150 గ్రాముల చిన్న ప్యాక్ లను 130 గ్రాములకు కుదించింది. ఇక, అత్యధికంగా అమ్ముడయ్యే సర్ఫ్ ఎక్సెల్ పై ఏకంగా రూ.14 పెంచారు. సౌందర్యం కోసం ఉపయోగించే లక్స్ సబ్బుల ధర గరిష్ఠంగా 12 శాతం పెరిగింది.

అధిక ద్రవ్యోల్బణం ఒత్తిళ్ల కారణంగానే హిందూస్థాన్ యూనిలీవర్ సంస్థ ధరలు పెంచినట్టు తెలుస్తోంది. 20 ఏళ్ల గరిష్ఠానికి ముడిసరుకుల ధరలు పెరగడం కూడా తాజా ధరల పెంపునకు కారణంగా భావిస్తున్నారు.

WhatsApp End : ఈ ఆండ్రాయిడ్, ఐఫోన్లలో వాట్సాప్ పనిచేయదు.. ఎప్పటినుంచో తెలుసా?

* లాండ్రీ, బాడీ క్లెన్ సింగ్ కేటగిరీల్లో ధరల పెంపు
* డిటర్జెంట్ కేటగిరీలో వీల్ డిటర్జెంట్ ధర పెంపు. కిలో, అర కిలో ప్యాక్ లపై 3.5శాతం ధరలు పెంపు. 1-2 రూపాయల వరకు పెంపు. గతంలో అర కిలో ప్యాకెట్ ధర రూ.28. ఇకపై రూ.29. కిలో ప్యాకెట్ ధర గతంలో 56 రూపాయలు. ఇకపై రూ.58జ
* క్వాంటిటీ తగ్గింపు
* గతంలో రూ.10 ఖరీదు చేసే రిన్ డిటర్జెంట్ 150 గ్రాములు ఉండేది. ఇకపై 130 గ్రాములే.