సర్జికల్ దాడుల బాబు : సైనిక కుటుంబంలో‘మిరాజ్ సింగ్’ పుట్టాడు

ఢిల్లీ: తోటి సైనికులపై జరిగిన మానవబాంబుకు (పుల్వామా దాడి)ప్రతీకారంగా భారత వైమానికా దళం పాక్ ఉగ్ర శిబిరాలపై విరుచుకుపడి ప్రతీకారం తీర్చుకుంది. దీంతో భారతదేశం వాయుసేనకు నీరాజనాలు పలికింది. భారత్‌లో పెద్ద ఎత్తున సంబరాలు జరుగుతున్నాయి. యువత త్రివర్ణ పతాకాలను చేతపట్టి రోడ్లమీదకు వచ్చి వేడుకలు జరుపుకుంటున్నారు.
Read Also : దరిద్రం పట్టిస్తున్నావ్ : TikTokకు రూ.40కోట్ల జరిమానా
ఈ క్రమంలో మరో శుభవార్త వినిపించింది. అదే భారత సైనిక కుటుంబంలో ఓ బాబు జన్మించాడు. రాజస్థాన్‌లోని ఒక సైనిక కుటుంబంలో జన్మించిన శిశువుకు ‘మిరాజ్ సింగ్’ అనే పేరు పెట్టారు. రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాకు చెందిన డాబ్డా గ్రామనివాసి మహావీర్‌సింగ్ భార్య సోనమ్ గర్భవతిగా ఉన్నారు. ఆమెకు పురిటి నొప్పులు రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆమె ఒక మగపిల్లవాడికి జన్మనిచ్చింది.
భారతీయ వాయుసేన.. మిరాజ్ 2000 విమానాలతో పాక్‌పై దాడి చేస్తున్న సమయంలో ఆమెకు డెలివరీ కావటం యాధృశ్చికమే అయినా.. ఆ విజయానికి గుర్తుగా ఆ బాబుకు ‘మిరాజ్ సింగ్’ అని పేరు పెట్టుకుని మురిసిపోతున్నారు.
Read Also : నన్ను ఎవడూ.. ఏమీ పీకలేరు : బిగ్ బాస్ కౌశల్ ఉగ్రరూపం