Spider : పాముకే విషమిచ్చి చంపుతున్న సాలీడు
పాము కాటుకు చనిపోయారని చాలా వార్తలు చూసి ఉంటాం.. కానీ పామును వేరే ఓ జీవి కాటేసి చంపుతుందని చాలామందికి తెలియదు. కొందరు పరిశోదలు పాములు, సాలెపురుగులపై పరిశోధనలు చేసి వెల్లడించిన ఫలితాలు ఆశ్చర్యానికి గురిచేసేలా ఉన్నాయి.

Spider
Spider : చాలా పాములు విషం కలిగే ఉంటాయి. వీటి కాటుకు ఏ జంతువైన గంటల్లో మృత్యువు ఒడికి చేరుతుంది. కానీ అలాంటి విషసర్పాలనే తమ కాటుతో చంపి తింటున్నాయి సాలెపురుగు. పాము బాడీని ద్రవరూపంలోకి మార్చేసి తినేస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న శాస్త్రవేత్తలు షాక్ కి గురవుతున్నారు. సాలెపురుగు ఏంటి పామును తినడమేంటని అందరు ఆశ్చర్య పోయారు. ఇలాంటి కొన్ని వందల ఘటనలు చూసిన తర్వాత శాస్త్రవేత్తలు పరిశోధనలు వేగవంతం చేశారు.
వారు ప్రపంచవ్యాప్తంగా పలు పరిశీలనలు చేసిన తర్వాత విడోస్ స్పైడర్ వంటి 90 జాతుల సాలెపురుగులు పాములను చంపేసి తినేస్తున్నాయని గుర్తించారు. స్విట్జర్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ బేసెల్‌కు చెందిన సాలెపురుగు ఎక్స్‌పర్ట్ మార్టిన్ నీఫ్‌లర్ జరిపిన పరిశోధనల్లో ఈ ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాము, సాలెపురుగు ఘర్షణ పడితే 87 శాతం కేసుల్లో సాలెపురుగుదే పై చేయి అయిందట. వారు ఇలాంటి ఘటనలు 300 వరకు చేశారంట.. ఇక మిగతా 13 ఘటనల్లో కూడా పాములు గెలవడం లేదట.
ఎవరైనా వచ్చి వాటిని రక్షించడం ద్వారా అవి బ్రతికి బయటపడుతున్నాయట. థెరిడీడే కుటుంబానికి చెందిన సాలెపురుగు తయారుచేసే సాలె గూళ్ల ధరలు చాలా గట్టగా ఉంటాయని, భారీ కాయంతో ఉండే పాములు కూడా వీటి గూడులో చిక్కితే కతమైనట్లే. పాము గూడులో చిక్కుకోగానే సాలెపురుగు పాముకు విషాన్ని ఎక్కిస్తాయి.. సాలెపురుగు కాటుకు గురైన పాములు పక్షవాతం వచ్చినట్లుగా పడిపోతాయి. ఆ తర్వాత పాము శరీర భాగాలు ద్రవ రూపంలోకి మార్చుకుని ఆ ద్రవాలను పీల్చుకు తినేస్తున్నాయని మార్టిన్ వివరించారు. ఆ చిన్న సాలెపురుగు పామును నెలల పాటు కొద్దీ కొద్దిగా తినేస్తుంది.