మరిదితో ఎఫైర్.. భర్తను హత్యచేసిన భార్య.. పట్టించిన ఇన్‌స్టా చాటింగ్.. హత్య సమయంలో ప్రియుడితో చాటింగ్.. వాళ్ల మధ్య సంభాషణ సాగిందిలా..

సుష్మిత రాహుల్‌ను ఇలా అడిగింది.. నిద్రమాత్రలు తీసుకున్న తర్వాత చనిపోవడానికి ఎంత సమయం పడుతుందో చూడండి. కరణ్‌ నిద్రమాత్రలు కలిపిన భోజనం తిని మూడు గంటలు అయింది. కానీ, వాంతులు లేవు.. అతను ఇంకా చనిపోలేదు.

మరిదితో ఎఫైర్.. భర్తను హత్యచేసిన భార్య.. పట్టించిన ఇన్‌స్టా చాటింగ్.. హత్య సమయంలో ప్రియుడితో చాటింగ్.. వాళ్ల మధ్య సంభాషణ సాగిందిలా..

Updated On : July 20, 2025 / 7:37 AM IST

Delhi: దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మరిదితో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ.. భర్తను హత్య చేసింది. తొలుత భోజనంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. అయినా, భర్త చనిపోకపోవటంతో కరెంట్ షాక్ ఇచ్చి హత్యచేసింది. వెంటనే విద్యుదాఘాతానికి గురైయ్యాడంటూ ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడి వైద్యులు అప్పటికే చనిపోయినట్లు చెప్పారు. దీంతో అందరూ ఇది కరెంట్ షాక్ తో జరిగిన మరణం అనుకున్నారు. కానీ, ఆమె ఫోన్లో ఇన్‌స్టా ఛాటింగు పరిశీలించగా.. అసలు విషయం బయటపడింది. మరిదితో మోజులో భర్తను హత్యచేసినట్లు తేలింది. ఇంతకీ.. ఇన్‌స్టా చాటింగ్‌లో ఏముందంటే..

ఢిల్లీకి చెందిన సుష్మిత, కరణ్ దేవ్ (36) భార్యాభర్తలు. పెళ్లి జరిగిన కొంతకాలంకే వీరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. కరణ్ దేవ్ సుస్మితను తరచుగా కొట్టేవాడు. డబ్బుల కోసం వేధించేవాడు. దీంతో సుష్మితకు భర్తపై ఆసక్తిపోయింది. ఇదే సమయంలో కరణ్ దేవ్ కు తమ్ముడు వరుసయ్యే (బాబాయ్ కొడుకు) రాహుల్ తో సుష్మితకు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. వాళ్లిద్దరూ తరచూ కాల్స్ మాట్లాడుకునేవారు. చాటింగ్ చేసుకునేవారు. సుష్మిత, రాహుల్ తో సంతోషంగా ఉండేది. దీంతో భర్తను అడ్డుతొలగించుకొని రాహుల్ తో కలిసి జీవితాన్ని కొనసాగించాలని భావించింది. అందుకు రాహుల్ సైతం అంగీకరించడంతో కరణ్ దేవ్ ను హత్య చేసేందుకు పక్కా ప్లాన్ వేశారు.

జులై 13వ తేదీన కరణ్ దేవ్ తినే ఆహారంలో 15 నిద్రమాత్రలు కలిపింది. అతను నిద్రలోకి జారుకున్నాడు. అయితే, మరణించక పోవటంతో రాహుల్ సూచన మేరకు సుష్మిత విద్యుత్ షాక్ ఇచ్చింది. దీంతో అతడు చనిపోయాడని నిర్ధారించుకున్న తరువాత ఆస్పత్రికి తీసుకెళ్లింది. విద్యుదాఘాతంకు గురయ్యాడని చెప్పింది. పరీక్షించిన వైద్యులు అప్పటికే కరణ్ దేవ్ మరణించాడని చెప్పారు. ఆమె మాట నమ్మి, ప్రమాదమే అని భావించిన కరణ్‌ కుటుంబసభ్యులు పోస్టుమార్టం అవసరం లేదని చెప్పారు. కానీ.. ఈ కేసులో 24యేళ్ల రాహుల్‌ తీరుపై పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో మృతదేహానికి పోస్టుమార్టం చేయాలని నిర్ణయించారు. ఇదే సమయంలో కరణ్‌ తమ్ముడు కునాల్‌కు కూడా అన్న మరణంపై అనుమానం వచ్చి.. సుస్మిత ఇన్‌స్టా ఛాటింగును పరిశీలించాడు. దీంతో అసలు గుట్టు బయటపడింది.

కరణ్ దేవ్ ను హత్యచేసే సమయంలో ప్రియుడు రాహుల్, సుష్మిత మధ్య చాటింగ్ ఇలా సాగింది..
సుష్మిత రాహుల్‌ను ఇలా అడిగింది.. నిద్రమాత్రలు తీసుకున్న తర్వాత చనిపోవడానికి ఎంత సమయం పడుతుందో చూడండి. కరణ్‌ నిద్రమాత్రలు కలిపిన భోజనం తిని మూడు గంటలు అయింది. కానీ, వాంతులు లేవు.. అతను ఇంకా చనిపోలేదు.
మళ్లీ.. మనం ఎం చేయాలి..? మీ వద్ద ఏమైనా సూచనలు ఉన్నాయా..? అని సుష్మిత రాహుల్‌ను అడిగింది.
రాహుల్ స్పందిస్తూ.. మీకు వేరే ఏమీ తోచకపోతే అతనికి విద్యుత్ షాక్ ఇవ్వండి.
సుష్మిత.. షాక్ ఇవ్వడానికి నేను అతన్ని ఎలా కట్టేయాలి.?
రాహుల్ .. టేప్ వాడండి.
సుష్మిత.. అతని శ్వాస చాలా నెమ్మదిగా ఉంది.
రాహుల్ .. మీ దగ్గర ఉన్న మందులన్నీ అతనికి ఇవ్వండి.
సుష్మిత.. నేను అతని నోరు తెరవలేకపోతున్నాను. నేను నీళ్లు పోయగలను. కానీ, మందులు ఇవ్వలేను. నువ్వు ఇక్కడికి రా.. బహుశా మనం కలిసి అతనికి నిద్రమాత్రలు మరిన్ని ఇవ్వొచ్చు.

సుష్మిత, రాహుల్ మధ్య ఛాటింగ్ తరువాత వారిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. వారిమధ్య గత రెండేళ్లుగా వివాహేతర సంబంధం ఉందని తేలింది. కరణ్ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. ఈ హత్య వెనుక కరణ్ ఆస్తిని దక్కించుకొని, రాహుల్‌తో కలిసి జీవితాన్ని కొనసాగించాలని సుష్మిత ప్లాన్ వేసిందని భావిస్తున్నామని పేర్కొన్నారు. నిందితులిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.