Vijay: కేంద్ర మంత్రి అమిత్ షాపై తమిళ నటుడు విజయ్ సంచలన వ్యాఖ్యలు
రాజ్యసభలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్రదుమారం రేపుతున్నాయి. తాజాగా.. అమిత్ షా వ్యాఖ్యలపై తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత విజయ్ స్పందించారు.

Tamil actor Vijay
Tamil Actor Vijay: తమిళ సినీరంగంలో దళపతిగా తనదైన ముద్ర వేసుకున్న హీరో విజయ్ ఇటీవల రాజకీయ రంగప్రవేశం చేసిన విషయం తెలిసిందే. తమిళగ వెట్రి కళగం పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేసి, భారీ బహిరంగ సభ నిర్వహించి పార్టీ జెండాను కూడా ఆవిష్కరించారు. తమిళనాడులో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి టీవీకే పార్టీ సిద్ధమవుతుంది. అయితే, తాజాగా విజయ్ కేంద్ర మంత్రి అమిత్ షాపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నవేళ విజయ్ ట్విటర్ వేదికగా అమిత్ షాపై ఫైర్ అయ్యారు.
Also Read: KTR : దమ్ముంటే.. ఆ అంశంపై అసెంబ్లీలో చర్చ పెట్టండి- సీఎం రేవంత్ కు కేటీఆర్ సవాల్
విజయ్ ట్వీట్ ప్రకారం.. ‘‘ కొంతమందికి అంబేద్కర్ పేరు అంటే ఎలర్జీ కావచ్చు. ఆయన భారత పౌరులందరికీ స్వాతంత్ర్య స్ఫూర్తిని రగిలించిన సాటిలేని రాజకీయ మేధావి. ఆయన వారసత్వం అట్టడుగు ఆశాజ్యోతి, సామాజిక అన్యాయానికి, వ్యతిరేక ప్రతిఘటనకు ప్రతీక. అంబేడ్కర్.. అంబేడ్కర్.. అంబేడ్కర్ అని ఆయన పేరు అంటే మనసు, పెదవులకు సంతోషంగా ఉంటుంది.’’ అంటూ విజయ్ పేర్కొన్నారు.
Also Read: Youtuber Bhanu Chander Arrest : తిక్క కుదిరింది.. రోడ్డుపై డబ్బులు విసిరేసిన ఆ యూట్యూబర్ అరెస్ట్..
రాజ్యసభలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్రదుమారం రేపుతున్నాయి. దేశవ్యాప్తంగా విపక్షాలు ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాయి. అమిత్ షా మాట్లాడుతూ.. అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్.. అని ఇన్ని సార్లు భగవంతుడి పేరు తలచుకొంటే ఏడేడు జన్మలు వారికి స్వర్గంలో స్థానం లభించేదన్నారు. అమిత్ షా వ్యాఖ్యలపై ఉభయ సభల్లోని ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. హోమంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలంటూ డిమాండ్ చేశాయి. అమిత్ షా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి సభ్యులు పార్లమెంట్ ఆవరణలో బుధవారం ఆందోళన నిర్వహించారు.
అయితే.. ప్రతిపక్షాల డిమాండ్ పై అమిత్ షా స్పందించారు. అంబేడ్కర్ పై తన వ్యాఖ్యలను కాంగ్రెస్ వక్రీకరించిందని, గతంలోనూ ఆ పార్టీ ఇలాగే వ్యవహరించిందని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని కాపాడటానికి ఎన్డీయే నేతలు కృషి చేస్తున్నారనే అక్కసుతో ఆ పార్టీ ఇలా వ్యవహరిస్తోంది. కాంగ్రెస్సే అంబేడ్కర్ వ్యతిరేఖి. రిజర్వేషన్ల వ్యతిరేఖి. మా పార్టీ ఎన్నడూ అంబేడ్కర్ ను అవమానించలేదు అంటూ అమిత్ షా పేర్కొన్నారు.