Tamil Nadu: బంగారం కోసం పక్కింటి ముసలావిడను హత్య చేసిన బాలిక

బంగారం కావాలనే అత్యాశతో ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న బాలిక అఘాయిత్యానికి పాల్పడింది. పొలాచిలోని పక్కింట్లో ఉంటున్న 76ఏళ్ల వృద్ధురాలిని హత్య చేసింది. ఘటన జరిగిన..

Tamil Nadu: బంగారం కోసం పక్కింటి ముసలావిడను హత్య చేసిన బాలిక

Delhi Women Pick Pockets Arrested

Updated On : April 18, 2022 / 3:50 PM IST

Tamil Nadu: బంగారం కావాలనే అత్యాశతో ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న బాలిక అఘాయిత్యానికి పాల్పడింది. పొలాచిలోని పక్కింట్లో ఉంటున్న 76ఏళ్ల వృద్ధురాలిని హత్య చేసింది. ఘటన జరిగిన సాయంత్రానికే బాలికను హత్య చేసి ఆమె వద్ద నుంచి ఆభరణాలను రికవరీ చేసుకున్నారు పోలీసులు.

కొడుకుతో కలిసి నాగలక్ష్మీ (76) అనే మహిళ పొలాచిలో నివాసముంటుంది. శనివారం ఉదయం నాగలక్ష్మి కూతురు ఇంటికి వచ్చి చూసేసరికి చనిపోయి కనిపించింది. ఇంట్లో ఉన్న బంగారం (చైన్లు, గాజులు, ముక్కు పుడక, చెవి రింగులు) మిస్ అయినట్లు గమనించి పోలీసులకు కంప్లైంట్ చేసింది.

ఒంటిపై గాయాలు కూడా లేకపోవడంతో సీసీటీవీ కెమెరా ద్వారా ఎంక్వైరీ చేశారు. బాలికను నిందితురాలిగా పరిగణించి విచారణ మొదలుపెట్టగా.. తన పేరెంట్స్ దినసరి కూలీలని, పెళ్లికోసం నగలు దాచేటంత స్తోమత వారికి లేదని అందుకే ఇలా చేశానని చెప్పింది. ఐపీసీ సెక్షన్ 302, 392, 397ల ప్రకారం కేసు ఫైల్ చేసి అరెస్ట్ చేశారు.

Read Also : టీవీఎస్ దొంగిలిస్తే.. మరొకడు సీసీ కెమెరాలనే ఎత్తుకెళ్లాడు