Tamil Nadu Election Results 2026 Live: తమిళనాడులో సంచలనం.. డీఎంకే, టీవీకే హోరాహోరీ
Tamil Nadu Election Results 2026 Live : దేశమంతటా తీవ్ర ఉత్కంఠ సృష్టిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల భవితవ్యం మరికొన్ని గంటల్లోనే తేలిపోనుంది. ముఖ్యంగా తమిళనాడుపైనే అందరిచూపు కేంద్రీకృతమైంది.
Tamil Nadu Elections Results 2026
Tamil Nadu Election Results 2026 Live : తమిళనాడులో డీఎంకే, టీవీకే మధ్య హోరాహోరీ నడుస్తోంది.
తిరుచి ఈస్ట్ లో విజయ్ వెనుకంజలో ఉన్నారు. కానీ, పెరంబూర్ లో ముందంజలో ఉన్నారు.
పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్
డిఎంకే 43 స్థానాలు
ఏఐడిఎంకే – 24 స్థానాలు
టీవీకే 16 స్థానాల్లో ముందంజ
బీజేపీ అభ్యర్థి, తెలంగాణకు గతంలో గవర్నర్ గా పనిచేసిన తమిళిసై సౌందర్ రాజన్ వెనుకంజలో ఉన్నారు. ఆమె చెపాక్ – తిరువెల్లికేని నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
తమిళనాడులో పెద్ద నేతలు అందరూ లీడ్ లో ఉన్నారు. కొలత్తూర్ నుంచి సీఎం స్టాలిన్, పెరంబూర్ నుంచి టీవీకే చీఫ్ విజయ్ ముందంజలోఉన్నారు. ఉదయనిధి స్టాలిన్ కూడా లీడ్ లో కొనసాగుతున్నారు.
తమిళనాడులో ఎన్నికల ఫలితాలు మొదలయ్యాయి. పోస్టల్ బ్యాలెట్ లో డీఎంకే పార్టీ కొంచెం ముందంజలో ఉంది. అన్నాడీఎంకే కూడా వెనుకే వస్తోంది. అయితే, పోస్టల్ బ్యాలెట్ లో విజయ్ పార్టీ టీవీకే పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ, పెరంబూర్ లో విజయ్ ముందంజలో ఉన్నారు.
దేశమంతటా తీవ్ర ఉత్కంఠ సృష్టిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల భవితవ్యం మరికొన్ని గంటల్లోనే తేలిపోనుంది. ముఖ్యంగా తమిళనాడుపైనే అందరిచూపు కేంద్రీకృతమైంది. తమిళనాడులో మొత్తం సీట్లు 234కాగా.. మ్యాజిక్ ఫిగర్ 118. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. డీఎంకేకి అంచనా సీట్లు 100-130 మధ్య ఉండగా.. టీవీకేకు కొన్ని సర్వేలు 40-120 సీట్ల వరకు అవకాశం ఉందని చెప్పాయి. ఇలాంటి అనిశ్చితి హంగ్ అసెంబ్లీకి దారితీయచ్చునని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. దీంతో తమిళనాడులో అధికారంలోకి వచ్చేది ఎవరు అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఈ ఉత్కంఠకు మరికొద్ది గంటల్లో తెరపడనుంది.
