CM MK Stalin : తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం స్టాలిన్ పర్యటన.. బాధితులకు భరోసా

ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులను స్వయంగా కలిసి వారి కష్టాలు తెలుసుకున్నారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

CM MK Stalin : తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం స్టాలిన్ పర్యటన.. బాధితులకు భరోసా

Tamil Nadu CM MK Stalin

Tamil Nadu CM MK Stalin .. Michaung Cyclone : మించాంగ్ తుపాను బీభత్సంలో తమిళనాడు అతలాకుతలంగా మారిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. పలు విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. చెన్నైలో భారీ వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారిపోయాయి. ఎయిర్ పోర్టు రన్ వేపైకి భారీగా వరద నీరు చేరడంతో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్లన్నీ నదుల్ని తలపిస్తున్నాయి.

ఇటువంటి పరిస్థితుల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులను స్వయంగా కలిసి వారి కష్టాలు తెలుసుకున్నారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.వారికి నీరు, ఆహారం వంటివి అందించారు. తుఫాను బాధిత ప్రజలకు ఆయన సహాయ సామగ్రిని కూడా పంపిణీ చేశారు.

స్టాలిన్ ప్రజలతో మమేకమవుతు వారికి ధైర్యాన్ని కల్పిస్తున్నారు. బాధితులు ఆశ్రయం పొందుతున్న శిబిరాలకు వచ్చి వారితో స్వయంగా మాట్లాడి వారికి ఆహారాన్ని అందిస్తున్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యం కల్పిస్తున్నారు. సీఎం స్వయంగా వచ్చి తమ పరిస్థితిని తెలుసుకుంటుండటంతో బాధితులంతా సంతోషం వ్యక్తంచేస్తున్నారు.

కాగా..తమిళనాడులో వర్ష బీభత్సానికి వరదనీటిలో కార్లు కొట్టుకుపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అలాగే రోడ్లు నదుల్ని తలపిస్తున్నాయి. పడవలపై తిరుగుతున్న పరిస్థితి నెలకొంది. భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిదిమంది ప్రాణాలు కోల్పోయారు.