CM Stalin Meets PM Modi : మోదీని కలిసిన స్టాలిన్

తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు.

CM Stalin Meets PM Modi : మోదీని కలిసిన స్టాలిన్

Mk Stalin

Updated On : June 17, 2021 / 8:53 PM IST

CM Stalin Meets PM Modi తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. సీఎంగా అయిన తర్వాత తొలిసారి దిల్లీ వెళ్లిన డీఎంకే చీఫ్.. మోదీని కలిసి కాసేపు ముచ్చటించారు. ప్రధానితో సమావేశం సంతృప్తికరంగా ఉందని సమావేశం అనంతరం స్టాలిన్ తెలిపారు. నూతన వ్యవసాయ చట్టాలు,నీట్ రద్దు,నూతన విద్యావిధానం,సేతుసముద్రం ప్రాజెక్టు పునురుద్దరణ,వ్యాక్సిన్ ఉత్పత్తికి సంబంధించిన విషయాలపై ప్రధాని మోదీతో చర్చించినట్లు స్టాలిన్ తెలిపారు.

రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి తన సహకారం,సహాయం అందిస్తామని ప్రధాని హామీ ఇచ్చారని స్టాలిన్ తెలిపారు. తమిళనాడుకి సంబంధించిన ఇష్యూస్ గురించి చర్చించేందుకు తనను ఎప్పుడైనా కలవవచ్చు అని ప్రధాని మోదీ తనకు హామీ ఇచ్చారని స్టాలిన్ పేర్కొన్నారు. కాగా, ఈ నెల ప్రారంభంలో కోవిడ్ వ్యాక్సిన్లను పూర్తిగా కేంద్రమే సేకరించి రాష్ట్రాలకు పంపిణీ చేస్తుందని ప్రధాని చేసిన ప్రకటనను స్టాలిన్ ప్రశంసించిన విషయం తెలిసిందే.